‘మనోవిరాగి’లో మోదీ లుక్!

  • Published By: sekhar ,Published On : September 17, 2020 / 06:53 PM IST
‘మనోవిరాగి’లో మోదీ లుక్!

Updated On : September 17, 2020 / 7:57 PM IST

Narendra Modi’s Biopic Manoviragi: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనో విరాగి’. తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. తమిళంలో ‘కర్మయోగి’ పేరుతో విడుదల చేయనున్నారు.


ఎస్. సంజయ్ త్రిపాఠీ రచన, దర్శకత్వంలో మహావీర్ జైన్‌తో కలిసి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బయోపిక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.


నరేంద్ర మోదీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్న ‘మనో విరాగి’ చిత్రాన్ని.. మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని వాద్ నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలలో చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.