Sai Dharam Tej : యాక్టర్ నరేష్ కొడుకు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సినిమా.. మీకు తెలుసా..?

సీనియర్ యాక్టర్ నరేష్ కొడుకు.. హీరో మరియు దర్శకుడు అని మీలో ఎంతమందికి తెలుసు..? అతను సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా కూడా..

Sai Dharam Tej : యాక్టర్ నరేష్ కొడుకు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సినిమా.. మీకు తెలుసా..?

Naresh son Naveen Vijaya Krishna is the director of Sai Dharam Tej Satya

Updated On : August 15, 2023 / 5:05 PM IST

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా విరూపాక్ష (Virupaksha), బ్రో (Bro) సినిమాలతో వెంట వెంటనే ఆడియన్స్ ని పలకరించాడు. ఆ మధ్య కొత్త దర్శకుడితో ఒక సినిమా ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు అది సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇది ఇలా ఉంటే, తేజ్ గతంలో ‘సత్య’ (Satya) అనే ఒక షార్ట్ ఫీచర్ ఫిలింలో నటించాడు. ఆ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమవుతుంది. అయితే ఆ మూవీని డైరెక్ట్ చేసింది టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ (Naresh) కొడుకు అని మీలో ఎంతమందికి తెలుసు..?

Akshay Kumar : ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్న అక్షయ్.. మరి ఇన్నాళ్లు ఏ దేశపౌరుడిగా..?

నవీన్ విజయ కృష్ణ (Naveen Vijaya Krishna) నరేష్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ హీరోగా ఒక సినిమా కూడా చేశాడు. ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే మరో సినిమాలో కూడా నటించాడు. కానీ హీరోగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకోలేకపోయాడు. కాగా నవీన్ అండ్ సాయి ధరమ్ తేజ్ చదువుకుంటున్న సమయం నుంచి మంచి స్నేహితులు. అలాగే కలర్ స్వాతి కూడా వీరికి స్నేహితురాలే.

Reba Monica : బ్రో సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ఛాన్స్ అందుకున్న రెబా మోనికా.. ఏం జరిగింది..?

ఈ ముగ్గురితో పాటు మరికొందరు స్నేహితులు కలిసి ‘సత్య’ అనే ఫీచర్ ఫిలింని తెరకెక్కించారు. దేశసరిహద్దుల్లో దేశం కోసం ప్రాణం ఇచ్చే సైనికుల మాత్రమే కాదు, వారి భార్యలు కూడా తమ భర్తలని దేశం కోసం పంపించి ఎటువంటి త్యాగం చేస్తున్నారు అనే అంశాన్ని చూపిస్తూ ఈ ఫిలింని తెరకెక్కించారు. 23 నిముషాలు పాటు ఉండే ఈ ఫిలింలో ఒక 6 నిముషాలు సాంగ్ ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న మూవీలోని సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మాత్రం తెలియజేయలేదు.