Nargis Fakhri sister : ప్రముఖ నటి సోదరి అరెస్ట్.. ప్రియుడు ఉన్న ఇంటికి నిప్పు అంటించి..

మాజీ ప్రియుడితో పాటు ఆయన స్నేహితురాలు అనస్తాసియా ఎట్టియెన్ ను హతమార్చింది నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ.

Nargis Fakhri sister : ప్రముఖ నటి సోదరి అరెస్ట్.. ప్రియుడు ఉన్న ఇంటికి నిప్పు అంటించి..

Nargis Fakhri sister Aliya has been arrested

Updated On : December 3, 2024 / 10:34 AM IST

Nargis Fakhri sister : బాలీవుడ్ ప్రముఖ నటి నర్గీస్ ఫక్రీ పేరు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఎందుకంటే.. నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ కారణంగా. ఈమె తన మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్ ను హత్యచేసింది. మాజీ ప్రియుడితో పాటు ఆయన స్నేహితురాలు అనస్తాసియా ఎట్టియెన్ ను హతమార్చింది. వీరిద్దరినీ సజీవదహనం చేసిందట అలియా ఫక్రీ. ఇందుకుగాను ఆమెను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసారు.

మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్, ఆయన స్నేహితురాలు అనస్తాసియా ఎట్టియెన్ మంచి స్నేహితులట. కానీ ఆ స్నేహం మరింత పెరిగి ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్ కి తను ఎక్కడ దూరమవుతుందో అని అలియా ఫక్రీ వారిద్దరినీ సజీవ దహనం చేసిందని అంటున్నారు అక్కడున్న జనాలు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూడలేకే మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్, ఆయన స్నేహితురాలు అనస్తాసియా ఎట్టియెన్ కలిసి ఉన్న ఒక రెండు అంతస్థుల గ్యారేజికి నిప్పు అంటించిందట.

Also Read : Shobha Shetty : ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నటి.. మధ్యలోనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి..

కాగా ఇదే విషయం పై ఆమె తల్లి కూడా స్పందించింది.” నా కూతురు ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మను. తనకి ఒకరికి సహాయం చెయ్యడం మాత్రమే తెలుసు. అలాంటిది ఒక మనిషిని ఎలా చంపుతుంది. ఇటీవల ఆమె కొద్ది రోజుల ముందు తన పళ్ళకి సంబందించిన ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ సమయంలో నొప్పికి సంబందించిన కొన్ని మత్తు పదార్ధాలను తీసుకుంది. అప్పటి నుండి తను ఏం చేస్తుందో తనకే అర్ధం కావడంలేదు. అప్పటి నుండే ఆమెలో కొత్త మార్పులు వచ్చాయి అని పేర్కొంది.” ఈ విషయం పై తన తల్లి స్పందించినప్పటికీ నటి నర్గీస్ ఫక్రీ మాత్రం స్పందించలేదు. ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి…