Producer Natti kumar : పవన్ vs ద్వారంపూడి..మధ్యలో ముద్రగడ.. నట్టి కుమార్!
పవన్ కళ్యాణ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య మాటల యుద్ధంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు పై సినీ నిర్మాత నట్టి కుమార్ రియాక్ట్ అయ్యారు.

Natti kumar reaction on Mudragada Padmanabham comments about Pawan Kalyan
Producer Natti kumar : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల వారాహి యాత్రలో భాగంగా కాకినాడ సిటీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ ప్రసంగిస్తూ కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు.. వైసీపీ మరియు జనసేన మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) స్పందిస్తూ చేసిన కామెంట్స్ పలువురికి ఆగ్రహం వ్యక్తం తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సినీ నిర్మాత నట్టి కుమార్ ముద్రగడ వ్యాఖ్యలు పై రియాక్ట్ అయ్యారు.
నట్టి కుమార్..
ఇటీవల వారాహి టూర్ లో.. పవన్ కళ్యాణ్ మరియు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ పరంగా ఒకర్ని ఒకరు విమర్శలు చేసుకున్నారు. దానిని నేను తప్పుబట్టడం లేదు. కానీ వీరిద్దరి రాజకీయ గొడవలో కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం ఎందుకు వచ్చారు. ఆయనకి ఏమి సంబంధం ఉంది. వైసీపీ పార్టీలో ఉన్న కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని విమర్శించినప్పుడు నేను ఏమి మాట్లాడలేదు. కానీ ముద్రగడ వైసీపీ నేత కాదు, ఒక కాపు ఉద్యమ నేత. పవన్-ద్వారంపూడి గొడవని కాపు-రెడ్డి గొడవగా ఎందుకు ముద్రగడ మాట్లాడుతున్నారు.
అప్పటి కాపు ఉద్యమానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాతగారు దండుగా ఉన్నారని ముద్రగడ చెప్పుకొస్తూ.. ఆ మొత్తం ఉద్యమం వారే నడిపారని మాట్లాడడం కూడా తప్పు. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక మాట తెలియక నోరు జారారని అనుకుంటున్నాను. ఆ మాట ఏంటంటే.. తానూ అనుకుంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక్క జెండా లేదా పోస్టర్ కూడా కట్టనివ్వను అంటూ వ్యాఖ్యానించారు. ఆ మాట చాలా తప్పు. అది ఆయన అహంకారానికి నిదర్శనం. నేను డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగిన వాడినే, మీ తండ్రి గారు కూడా అదే డిస్ట్రిబ్యూటర్ గా చేసిన వారే. మీ ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ గురించి తెలుసు. అలాంటి మీరు అహంకారంతో మాట్లాడం తప్పు. అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన వెళ్తున్న రూట్ కరెక్ట్. ఆయనకి అందరూ సపోర్ట్ చేయాలి. ఆయన తప్పకుండా సీఎం అవుతారు.