Natti kumar : ఏపీ ప్రభుత్వాన్ని అవమానించారు.. ఆస్కార్ సన్మాన సభపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..
అందరూ కలిసి తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు తెచ్చినందుకు కీరవాణి, చంద్రబోస్ లను ఘనంగా సత్కరించారు. అయితే ఈ కార్యక్రమంపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Natti kumar sensational comments on Oscar Felicitation Event
Natti kumar : తాజాగా ఆదివారం (ఏప్రిల్ 10)న టాలీవుడ్(Tollywood) అంతా కలిసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున కీరవాణి(Keeravani), చంద్రబోస్(Chandrabose), RRR యూనిట్ ని సన్మానించి అభినందించారు. హైదరాబాద్(Hyderabad) శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి తెలుగు సినీ ప్రముఖులతో పాటు తెలంగాణ(Telangana), ఆంద్రప్రదేశ్(Andhrapradesh) సినిమాటోగ్రఫీ మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. అందరూ కలిసి తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు తెచ్చినందుకు కీరవాణి, చంద్రబోస్ లను ఘనంగా సత్కరించారు.
అయితే ఈ కార్యక్రమంపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రెస్ నీట్ నిర్వహించి నట్టి కుమార్ మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు అనేది తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునేది. నిన్న ఫంక్షన్ చేసిన విధానం కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో 25 లక్షలు తీసి ఫంక్షన్ చేశారు. ఇది ఇంకా పెద్ద ఈవెంట్ గా అందరూ కలిసి చేయాల్సింది. ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఈ ఈవెంట్ కి పిలుపులు లేవు. పోసాని కృష్ణ మురళి, అలీ, రోజాలను పిలిచారా?, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఏపీకి వెళ్లి టికెట్స్ రేట్స్ గురించి అడిగితే వెంటనే పెంచారు కదా. కానీ ఇప్పుడు కనీసం పిలుపు కూడా లేదు. ఒకవేళ పిలిచినా వాళ్ళు రాలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను మీరు అవమానించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ తెలంగాణ వచ్చాక, రాక ముందు ఎలా ఉండేది అని మాట్లాడారు. దీనిపై నట్టి కుమార్ మాట్లాడుతూ.. మీరు సపోర్ట్ చేసేది కొంతమందికే. థియేటర్స్ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. చిన్న సినిమాలని మీరు గుర్తించట్లేదు. పెద్ద సినిమాలను మాత్రమే గుర్తించారు. తెలంగాణాలో చిన్న సినిమాలు షూటింగ్స్ చేసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. 2014 కంటే 30 శాతం రేట్లు పెంచారు. చిన్న సినిమాలకు 5వ షో అడుగుతున్నాం కానీ ఇవ్వలేదు, పెద్ద సినిమాలకు ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ్ కు తెలియక మాట్లాడినట్టు ఉన్నారు. కావాలంటే ఆ రేట్లు అన్ని నేను చెప్తాను. మమ్మల్ని KTR దగ్గరికి, KCR దగ్గరికి తీసుకెళ్లండి మేము మాట్లాడతాం. మీరు నైజాం షేర్స్ ఎక్కువ వస్తాయి అన్నారు. కానీ 32 శాతం మాత్రమే తెలంగాణ నుంచి, మిగిలిన 68 శాతం మాత్రం ఆంధ్ర నుంచే వస్తుంది అని అన్నారు.
అక్కడ ఏపీ మినిష్టర్ వచ్చినా ఎవరూ పట్టించుకోలేదనిపించింది. ఏపీ మినిష్టర్ వచ్చి సినిమాలు చేయాలని అడిగారు అంతే కానీ అయన గట్టిగా మాట్లాడలేదు. దీనిపై ఏపీ మంత్రి కూడా వివరణ ఇవ్వాలి. ఏపీ నుంచి ఎంతమంది వచ్చారు, ఏం చేశారు చెప్పాలి. టాలీవుడ్ కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. టాలీవుడి నుంచి కూడా ఎవరూ లేరు. కనీసం మా ప్రసిడెంట్ కూడా లేడు. ఈ ఈవెంట్ కి కౌన్సిల్ నుంచి డబ్బులు తీస్తే మాత్రం ఒప్పుకోము అని వ్యాఖ్యానించారు నట్టి కుమార్. ఇలా నట్టి కుమార్ ఆస్కార్ సన్మాన సభపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.