Naveen Chandra : నవీన్ చంద్ర భార్య గురించి తెలుసా? తను కూడా సినిమా ఇండస్ట్రీనే.. త్వరలో డైరెక్టర్ గా?
త్వరలో నవీన్ చంద్ర, స్వాతి కలిసి మంత్ అఫ్ మధు అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర తన భార్య గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పాడు.

Naveen Chandra Wife Orma Full Details Interesting Facts about Naveen Chandra Wife
Naveen Chandra : నటుడు నవీన్ చంద్ర మొదట పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు చేసి అందాల రాక్షసి(Andala Rakshasi) సినిమాలో ఒక హీరోగా చేసి అందర్నీ మెప్పించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నవీన్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. హీరోగానే చేయాలి అని కూర్చోకుండా ఏ పాత్రైనా చేయడానికి రెడీ అయిపోవడంతో నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర.
త్వరలో నవీన్ చంద్ర, స్వాతి కలిసి మంత్ అఫ్ మధు అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర తన భార్య గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పాడు. నవీన్ తన సోషల్ మీడియాలో తన భార్యతో ఉన్న ఫోటోలు కూడా గతంలో షేర్ చేశాడు. ఇటీవలే వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. నవీన్ కేరళకు చెందిన ఒర్మా(Orma) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని తెలుసు కానీ ఆమె గురించి ఎవరికీ అంతగా తెలీదు.
Also Read : Allu Arjun : భార్య బర్త్‌డేని లండన్‌లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన బన్నీ.. గులాబీల మధ్య..
తాజాగా నవీన్ చంద్ర తన భార్య గురించి చెప్తూ.. నా సక్సెస్ కి సీక్రెట్ మా వైఫ్. నేను ఇన్ని డిఫరెంట్ పాత్రలు చేయడానికి కూడా కారణం నా భార్యే. నా దగ్గరికి వచ్చిన కథలన్నీ మా భార్యకి వినిపిస్తాను. తను చాలా సంవత్సరాలు మలయాళంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసింది. మలయాళం స్టార్ డైరెక్టర్ సిద్దిఖ్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసింది. తనకి సినిమాల మీద పూర్తిగా అవగాహన ఉంది. ఒకవేళ భవిష్యత్తులో డైరెక్టర్ గా కూడా సినిమా తీయొచ్చేమో అని తెలిపాడు. దీంతో ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. నవీన్ చంద్ర వైఫ్ ఒర్మా సినిమా పరిశ్రమ అని, సినిమా గురించి మొత్తం తెలుసని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.