‘నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్
‘నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అభినందించారు..

‘నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అభినందించారు..
డిఫరెంట్ రోల్స్‌తో తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వాలంటైన్స్ డే స్సెషల్‌గా ‘నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్‌ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంచ్ చేశారు. ఒక విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉందని దిల్ రాజు మూవీ టీమ్‌ని అభినందించారు.
చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి సమర్పణలో త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ కందుకూరి నిర్మిస్తుండగా సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర సరసన గాయత్రి ఆర్ సురేష్ హీరోయిన్‌గా నటించింది. క్రిష్ సిద్దిపల్లి, అదితిలు మరో ముఖ్య పాత్రల్లో నటించారు. రాజారవీంద్ర కీలక పాత్రలో నటించారు.
ఈ సందర్బంగా నిర్మాత కళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ : ‘‘దిల్ రాజు గారు మా సినిమా ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథలు తెరపై చాలా కనిపించినా ఈ ప్రేమకథ అందించే ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వారి వారి ప్రేమ కథకి దగ్గరవుతారు. నవీన్ చంద్ర, హీరోయిన్ గాయత్రి ఆర్ సురేష్ వారి పాత్రల్లో ఇమిడిపోయి నటించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ ఇచ్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకొని దిల్ రాజు గారు అభినందించారు’’ అన్నారు.
సమర్పణ : ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి
బ్యానర్ : త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్
కొ-ప్రోడ్యూసర్స్ : గూడురు వెంకట్, గూడురు ప్రసాద్
కెమెరా : ఎస్.కె.ఏ.భూపతి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
మాటలు : సభీర్ షా
సంగీతం : జువెన్ సింగ్
లిరిక్స్ : రాంబాబు గోసాల.
Read Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్