Site icon 10TV Telugu

Anaganaga Oka Raju : ‘అన‌గ‌న‌గా ఒక రాజు’ టీజ‌ర్ రిలీజ్‌.. న‌వీన్ పొలిశెట్టి ఈస్ బ్యాక్‌..

Naveen Polishetty Anaganaga Oka Raju Teaser out now

Naveen Polishetty Anaganaga Oka Raju Teaser out now

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి న‌టిస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. ‘సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌’, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అప్పుడెప్పుడో ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. కొన్నాళ్ల క్రితం ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఆ త‌రువాత మ‌రేలాంటి అప్డేట్ కూడా రాలేదు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం త‌రువాత న‌వీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ కావ‌డంతో సినిమాల‌కు ఆయ‌న బ్రేక్ ఇచ్చాడు. దీంతో ఈ చిత్ర షూటింగ్‌కు వాయిదా ప‌డింది. ఇటీవ‌లే కోలుకున్న ఆయ‌న మ‌ళ్లీ షూటింగ్స్‌ను స్టార్ట్ చేశారు. తాజాగా అన‌గ‌న‌గా ఒక‌రాజు నుంచి ఓ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Director Bobby – Mokshagna : మోక్షజ్ఞ గురించి డైరెక్టర్ బాబీ కామెంట్స్.. అసలు అలాంటి కుర్రాడు మనకి దొరికితే..

ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ రిలీజ్ చేసిన దీని నిడివి మూడు నిమిషాల 2 సెక‌న్లు. ఇక టీజ‌ర్‌లో న‌వీన్ పొలిశెట్టి త‌న‌దైన కామెడీతో అల‌రించారు.

న‌వీన్ కు ముకేశ్ అంబానీ ఫోన్ చేసిన‌ట్లుగా చూపించారు. ముకేశ్ మామ‌య్య‌.. నీకు వంద రిచార్జులు అంటూ న‌వీన్ చెప్పిన డైలాగ్ న‌వ్వు లు పూయిస్తోంది. మొత్తంగా టీజ‌ర్ అదిరిపోయింది.

Tollywood : సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

Exit mobile version