Naveen Polishetty : అమెరికాలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయ్యిందా.. చేతికి గాయం..!

అమెరికాలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయ్యిందా. బైక్ డ్రైవ్ చేస్తూ జారిపడడంతో చేతికి..

Naveen Polishetty : అమెరికాలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయ్యిందా.. చేతికి గాయం..!

Naveen Polishetty met an accident at america news gone viral

Updated On : March 28, 2024 / 9:49 AM IST

Naveen Polishetty : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుని అందుకున్నారు. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాతో రిలీజైన ఈ చిత్రం.. మంచి కలెక్షన్స్ ని అందుకొని నవీన్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్టుని ఇచ్చింది. ప్రస్తుతం ఈ హీరో ‘అనగనగ ఒక రాజు’ సినిమాని చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరోకి యాక్సిడెంట్ అయిన వార్త వైరల్ గా మారింది.

నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారట. అక్కడ బైక్ డ్రైవ్ చేస్తూ జారిపడడంతో చేతికి ఫ్యాక్చర్ అయ్యినట్లు సమాచారం. దీంతో ఆయన రెండు నెలలు పాటు రెస్ట్ తీసుకోనున్నారట. మరి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. అభిమానులు కంగారు పడుతున్నారు. ‘టేక్ కేర్’ అంటూ నవీన్ పోలిశెట్టికి ట్వీట్స్ చేస్తున్నారు.

Also read : Ram Charan : RC16 సాంగ్స్ అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఆల్రెడీ మూడు సాంగ్స్..

కాగా ‘అనగనగా ఒక రాజు’ సినిమాని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ దర్శకుడు గత ఏడాది ‘మ్యాడ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు. మ్యాడ్ కంటే ముందే అనగనగా ఒక రాజు మూవీ రావాల్సింది. కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ కొన్ని కారణాలు వల్ల అది వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మొదలైందా లేదా అనే అప్డేట్ కూడా లేదు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.