Naveen Polishetty : తాను పడుతున్న ఇబ్బందులను ఫన్నీ వీడియోతో చెప్పిన నవీన్ పోలిశెట్టి.. వైరల్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా దూసుకుపోతున్నాడు నవీన్ పోలిశెట్టి.

Naveen Polishetty new video
Naveen Polishetty video : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా దూసుకుపోతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశాడు. వరుస విజయాలతో దూసుకున్న అతడు సినిమాలకు కాస్త విరామం ఇవ్వాల్సి వచ్చింది. నవీన్ కుడి చేతికి, కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం అతడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
తాజాగా నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన కుడికి బ్యాండేజ్ ఉండడంతో పడుతున్న ఇబ్బందులను ఆ వీడియోలో కాస్త ఫన్నీగా చూపించాడు. టీవీ చూద్దామన్న, డ్యాన్స్ చేద్దామన్న, ఆఖరికి అన్నం తినేటప్పుడు పడుతున్న ఇబ్బందులు ఇందులో చూపించాడు. లైఫ్ ఒక జిందగీ అయిపోయింది అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు.
ఎలాంటి సమస్యలు ఎదురైనా నవ్వుతూ ఉండాలని నవీన్ చెప్పాడు. అందరి నవ్వించడం తనకు చాలా ఇష్టం అని తెలిపాడు. పూర్తిగా కోలుకున్న తరువాత షూటింగ్‌లో పాల్గొని మిమ్మల్ని పెద్ద స్ర్కీన్ పై అలరిస్తా అని తెలిపాడు. మొత్తంగా ఈ వీడియో వైరల్‌గా మారింది.
View this post on Instagram