Naresh-Pavitra : పవిత్రతో నరేష్ పెళ్లిపై కొడుకు నవీన్ రియాక్షన్.. బయట చాలామంది..

నరేష్- పవిత్ర ప్రేమ, పెళ్లి విషయం పై నరేష్ మూడో భార్య తప్ప, ఇంకో కుటుంబసభ్యులు మీడియా ముందు రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నరేష్ కుమారుడు నవీన్ విజయ కృష్ణ మాట్లాడుతూ..

Naresh-Pavitra : పవిత్రతో నరేష్ పెళ్లిపై కొడుకు నవీన్ రియాక్షన్.. బయట చాలామంది..

Naveen Vijay Krishna comments on his father Naresh marriage with Pavitra

Updated On : August 24, 2023 / 5:16 PM IST

Naresh-Pavitra : టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ తన సహనటి పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఒక హోటల్ లో పవిత్ర-నరేష్ కలిసి ఉండగా, నరేష్ మూడో భార్య మీడియాతో సహా వచ్చి గొడవ చేయడంతో.. వీరిద్దరి రిలేషన్ అప్పటిలో సోషల్ మీడియా, వార్తల్లో బాగా ట్రెండ్ అయింది. ఆ తరువాత ఇద్దరు అఫీషియల్ గా పెళ్లి వార్త ప్రకటించడం, ఏడడుగులు వేసేయడం కూడా జరిగిపోయింది. ఇక ఇటీవల ‘మళ్ళీ పెళ్లి’ అంటూ వారిద్దరి ప్రేమ కథని సినిమాగా కూడా తీసుకు వచ్చేశాడు నరేష్.

Sai Dharam Tej : తేజ్ బైక్ యాక్సిడెంట్‌తో.. తన షెడ్‌లో ఉన్న బైక్స్ అన్ని అమ్మేసిన నరేష్ కొడుకు నవీన్..

అయితే ఈ ప్రేమ-పెళ్లి విషయం పై నరేష్ మూడో భార్య తప్ప, ఇంకో కుటుంబసభ్యులు మీడియా ముందు రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నరేష్ కుమారుడు నవీన్ విజయ కృష్ణ (Naveen Vijay Krishna) మాట్లాడాడు. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నవీన్ డైరెక్షన్ లో సత్య (Satya) అనే ఒక ఫీచర్ ఫిల్మ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో తాజాగా నవీన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో నవీన్‌ని.. నరేష్- పవిత్ర పెళ్లి గురించి ప్రశ్నించారు.

Naveen Vijaya Krishna : విజయ్ నిర్మల కోరిన ఏకైక కోరిక.. అందుకే హీరోగా ఎంట్రీ..

నవీన్ బదులిస్తూ.. “వాళ్ళు (నరేష్- పవిత్ర) మాత్రమే అలా చేయలేదు. బయట అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో సోషల్ మెసేజ్ ఏమి లేదు. జీవితాంతం వరకు ప్రశాంతంగా, ఆనందంగా బ్రతకడమే ఎవరి లక్ష్యం అయినా. ఎవరో ఏదో అనుకుంటున్నారని అని భయపడితే సంతోషంగా ఉండలేము. మా నాయనమ్మ (విజయ నిర్మల) మాకు ఎప్పుడు ఇలా ఉండాలి, ఇది చేయాలని చెప్పలేదు. మాకు నచ్చినట్లు బ్రతకమని ఫ్రీడమ్ ఇచ్చారు. అదే నాన్న ఫాలో అవుతారు. నా పెళ్లి కూడా నన్ను చేసుకోమన్నారు. ఆయన జస్ట్ వచ్చి అక్షింతలు వేసి వెళ్తాను అని చెప్పారు” అంటూ చెప్పుకొచ్చాడు.