Nayanthara : పెళ్లిపై స్పందించిన నయన్.. ఆయనే మా ఆయన!

పెళ్లిపై నటి నయనతార పెదవి విప్పారు. కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ తో నిశ్చితార్ధం జరిగిందని.. ముహూర్తం ఇంకా ఫిక్స్ కాలేదని అన్నారు.

Nayanthara : పెళ్లిపై స్పందించిన నయన్.. ఆయనే మా ఆయన!

Nayanthara

Updated On : August 16, 2021 / 9:16 AM IST

Nayanthara : సౌంత్ ఇండియన్ లో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణులలో నయనతార ముందు వరుసలో ఉంటారు. కొన్ని సినిమాలకు హీరోకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఈ అమ్మడు. 36 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పెళ్లికోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభుదేవా, శింబుతో ప్రేమాయణం నడిపి వారి నుంచి విడిపోయిన నయన్ ప్రస్తుతం విఘ్నేష్‌శివన్ తో ప్రేమంలో ఉన్నారు, అతడినే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే వీరి పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఎదో ఒక వార్త వస్తుంటుంది.

ఈ జంట మాత్రం పెళ్లి విషయంపై బహిరంగంగా ఎప్పుడు మాట్లాడలేదు. అయితే తాజాగా పెళ్లిపై పెదవి విప్పారు నయనతార. ఇటీవల ఓ తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పెళ్లికి సంబంధించి ఆసక్తి కర విషయాలు బయటపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని నయన్ తెలిపారు. వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదని.. ముహూర్తం ఫిక్స్ అయితే అభిమానులతో పంచుకుంటానని తెలిపారు.

రహస్యంగా పెళ్లి చేసుకునే ఆలోచన తమకు లేదని, వృత్తిపరంగా గోల్స్ సాధించే పనిలో తాము బిజీగా ఉండటం వల్లే ఇప్పటివరకు పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. విఘ్నేష్ తనకు బాయ్ ఫ్రెండ్ స్టేజి దాటిపోయాడు.. ఆయన నాకు కాబోయే భర్త. మీడియా కూడా ఇకపై వారి కథనాల్లో ఇలాగే రాస్తారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.