Nayanthara : ‘ఆయనకేంటి భయపడేది’.. ధనుష్ తో వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నయనతార..

తమిళ స్టార్ హీరో ధనుష్ తో వివాదానికి దిగింది నయన్.

Nayanthara : ‘ఆయనకేంటి భయపడేది’.. ధనుష్ తో వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నయనతార..

Nayanthara made shocking comments on the controversy with Dhanush

Updated On : December 12, 2024 / 11:54 AM IST

Nayanthara : తమిళ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది ఈమె. కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్న సమయంలో తమిళ స్టార్ హీరో ధనుష్ తో వివాదానికి దిగింది నయన్. నెట్ ఫ్లిక్స్ కోసం నయన్ చేసిన డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన నేను రౌడీనే అనే చిత్రం నుండి కొన్ని సీన్స్ తనకి చెప్పకుండా తీసుకున్నందుకు వీరి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

అయితే తాజాగా ఈ వివాదం పై స్పందిస్తూ.. ధనుష్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది నయన్.. ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. “అసలు ఈ విషయంపై ధనుష్ కి అంత ధైర్యంగా లేఖ ఎలా రిలీజ్ చేశారు అని అడిగితే.. నేనేమీ తప్పు చెయ్యలేదు.. నేను చేసింది రైట్ అని నాకు తెలిసినప్పుడు ఎవరికో.. ఎందుకు భయపడాలి.. నిజానికి ధనుష్ మా ఫ్రెండ్ అని అనుకున్నా.. అందుకే ఎన్ వో సీ అడిగాను.. తను స్పందించలేదు..అందుకే ధనుష్‌ను కలవాలి అనుకున్నాం.. అది కూడా కుదరలేదు..అని చెప్పుకొచ్చింది.

Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ పెళ్లి పనులు స్టార్ట్.. ఈరోజే పెళ్లి..

నేను రౌడీనే సినిమాలోని సీన్లు వాడుకోవడానికి కుదరదు అన్నారు.. కనీసం ఓ నాలుగు లైన్లు వాడుకుంటామని అన్నాను.. దానికి కూడా ఒప్పుకోలేదు..కానీ బిహైండ్ ది సీన్స్ అవి మా పర్సనల్.. మా జీవితంలో ఆ సీన్స్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు.. అది ధనుష్ అర్థం చేసుకుంటాడని అనుకున్నాం.. ఇప్పుడు బి హైండ్ ది సీన్స్ కూడా తీసుకున్నందుకు గొడవ. దీన్ని మాట్లాడి పరిష్కరించుకోవాలని అనుకున్నా.. కానీ జరగలేదు.. అని నయన్ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.