Nayanthara : సారీ చెప్పిన నయనతార.. ‘అన్నపురాణి’ సినిమా వివాదంపై స్పందించి.. జై శ్రీరామ్ అంటూ..

'అన్నపురాణి' సినిమా వివాదంపై తాజాగా నయన్ దీనిపై స్పందిస్తూ ఓ క్షమాపణ లేఖ రాసింది.

Nayanthara says Sorry on Annapoorani Movie Issue Letter Goes Viral

Nayanthara : సౌత్ లో దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయనతార. ఎన్నో కమర్షియల్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది. నయనతార ఇటీవల ‘అన్నపురాణి'(Annapoorani)సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మొదట థియేటర్స్ లో రిలీజయినప్పుడు ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు కూడా థియేటర్స్ లో.

అన్నపురాణి కథాంశం.. ఓ బ్రాహ్మణ అమ్మాయికి నాన్ వెజ్ వైపు ఆసక్తి కలగడం, చెఫ్ గా ఎదగాలనుకోవడం, ముస్లిం అబ్బాయితో ప్రేమ, బ్రాహ్మణ అమ్మాయి నమాజ్ చేసి నాన్ వెజ్ బిర్యానీ చేయడం, హీరో రాముడు నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పడం.. ఇలాంటివి మనోభావాలు దెబ్బతీసే చాలా సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. థియేటర్స్ లో చూసినప్పుడే వీటిపై కొంతమంది అభ్యంతరం తెలిపారు. కానీ సినిమా అంతగా ఆడలేదు కాబట్టి అప్పుడు ఎవ్వరికి తెలీదు. ఆ తర్వాత అన్నపురాణి సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా చూసిన వాళ్ళు అభ్యంతరం తెలిపారు.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు ఆటోగ్రాఫ్ చూశారా? ఎయిర్ పోర్ట్‌లో ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్ ఇచ్చిన మహేష్..

సినిమాపై, నయనతారపై, దర్శకుడిపై, నెట్‌ఫ్లిక్స్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక అమ్మాయి లేదా అబ్బాయి చెఫ్ గా ఎదగాలి అనే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఎందులోనూ మతం, దేవుడ్ని తీసుకురాలేదు. కానీ ఈ సినిమాలో కథకి మతాన్ని, దేవుడ్ని జోడించి మనోభావాలు దెబ్బతీసేలా తీయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్ తమ ఓటీటీనుంచి అన్నపురాణి సినిమాని తీసేసింది కూడా. అయితే ఇప్పటిదాకా ఈ వివాదంపై నయనతార స్పందించలేదు. తాజాగా నయన్ దీనిపై స్పందిస్తూ ఓ క్షమాపణ లేఖ రాసింది.

Also Read : Guntur Kaaram Collections : రమణగాడి జాతర.. వారం రోజుల్లో ‘గుంటూరు కారం’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

నయనతార తన లెటర్ లో.. ఇటీవల మా అన్నపురాణి సినిమాపై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్ రాస్తున్నాను. అన్నపురాణి కేవలం ఒక సినిమాగా మాత్రమే తీయలేదు. స్ఫూర్తిని పెంచే విధంగా తీసాము. మేము ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ని ఇద్దాము అనుకున్నాం. కానీ అనుకోకుండా కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఉండవచ్చు. ఈ సినిమాని ఓటీటీ నుంచి తీసేస్తారని మేము ఊహించలేదు. నేను, నా టీం ఎప్పుడూ ఒకరి మనోభావాల్ని దెబ్బ తీయాలని అనుకోము. ఈ సమస్యని మేము అర్ధం చేసుకున్నాము. దేవుడ్ని పూర్తిగా నమ్మి, రెగ్యులర్ గా దేవాలయాలకు వెళ్లే నేను ఇలా చేయడం ఇదే చివరిసారి. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియచేస్తున్నాను. అన్నపురాణి సినిమా ఉద్దేశం స్ఫూర్తినింపడం కానీ బాధ పెట్టడం కాదు. నా 20 ఏళ్ళ సినీ పరిశ్రమలో నేను అందరికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాను అని తెలిపింది. ఇక లెటర్ మొదట్లోనే జై శ్రీరామ్(Jai Shri Ram) అని రాసింది. దీంతో నయనతార రాసిన ఈ లెటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.