Mahesh Babu : మహేష్ బాబు ఆటోగ్రాఫ్ చూశారా? ఎయిర్ పోర్ట్‌లో ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్ ఇచ్చిన మహేష్..

మహేష్ ఎయిర్ పోర్ట్ లో సోలోగా కనపడటంతో అక్కడ పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడ్డారు.

Mahesh Babu : మహేష్ బాబు ఆటోగ్రాఫ్ చూశారా? ఎయిర్ పోర్ట్‌లో ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్ ఇచ్చిన మహేష్..

Super Star Mahesh Babu Autograph to Fans goes Viral

Updated On : January 19, 2024 / 7:45 AM IST

Mahesh Babu : మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. గుంటూరు కారం సినిమా ఆల్రెడీ 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకెళ్తుంది. త్వరలోనే గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ ని కూడా ప్లాన్ చేయబోతున్నారు. అయితే తాజాగా మహేష్ నిన్న సాయంత్రం జర్మనీకి(Germany) వెళ్ళాడు.

మహేష్ బాబు టైం దొరికితే ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తాడని తెలిసిందే. రెగ్యులర్ గా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తాడు మహేష్. కానీ ఈసారి సోలోగా వెళ్ళాడు. అయితే ఈ జర్మనీ ట్రిప్ రాజమౌళి(Rajamouli) సినిమా వర్క్ కోసం అని, మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాడని సమాచారం. మహేష్ ఎయిర్ పోర్ట్ లో సోలోగా కనపడటంతో అక్కడ పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడ్డారు.

Image

Also Read : Mahesh Babu : మహేష్ జర్మనీకి సోలో ట్రిప్..? రాజమౌళి సినిమా కోసమా?

దీంతో మహేష్ పలువురు అభిమానులకు ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ ఇవ్వగా అభిమానులు వాటిని తమ సోషల్ మీడియాల్లో షేర్ చేసుకున్నారు. ఓ అభిమానికి.. లవ్, మహేష్ బాబు అని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు మహేష్. అతను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం మహేష్ బాబు ఆటోగ్రాఫ్ వైరల్ అవుతుంది. ఇక మహేష్ త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.