Mahesh Babu : మహేష్ జర్మనీకి సోలో ట్రిప్..? రాజమౌళి సినిమా కోసమా?

మహేష్ రాజమౌళి(Rajamouli) సినిమా కోసం జర్మనీ వెళ్లినట్టు సమాచారం.

Mahesh Babu : మహేష్ జర్మనీకి సోలో ట్రిప్..? రాజమౌళి సినిమా కోసమా?

Mahesh Babu went Solo trip to Germany for Rajamouli Movie SSMB29

Updated On : January 19, 2024 / 7:36 AM IST

Mahesh Babu : మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు కారం సినిమా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మహేష్ ఇంట్లో ఆల్రెడీ గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక మహేష్ టైం దొరికితే ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తాడని తెలిసిందే. రెగ్యులర్ గా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తాడు మహేష్. కానీ ఈసారి సోలోగా వెళ్ళాడు.

మహేష్ బాబు నిన్న సాయంత్రం జర్మనీకి సోలో ట్రిప్ వెళ్ళాడు. అయితే ఎప్పటిలాగే సినిమా అయ్యాక రిఫ్రెష్ అవ్వడానికి జర్మనీ(Germany) వెళ్లారనుకున్నారు అంతా. కానీ మహేష్ రాజమౌళి(Rajamouli) సినిమా కోసం జర్మనీ వెళ్లినట్టు సమాచారం. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Also Read : Pawan Kalyan : ‘బ్రో’ సినిమా సాంగ్‌లో.. హీరోయిన్ స్టెప్స్‌ని పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశారా..!

SSMB29 సినిమాకు సంబంధించి టెక్నికల్ అంశాల కోసం మహేష్ జర్మనీ వెళ్లినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారంపై క్లారిటీ రాకపోయినా రాజమౌళి సినిమాకు సంబంధించి ఓ వర్క్ షాప్ కి మహేష్ జర్మనీ వెళ్లినట్టు తెలుస్తుంది. మూడు లేదా నాలుగు రోజుల్లో మహేష్ తిరిగొస్తాడని సమాచారం. ఇక మహేష్ ని ఎయిర్ పోర్ట్ వరకు భార్య నమ్రత డ్రాప్ చేసింది. మహేష్ జర్మనీ నుంచి వచ్చాక గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫ్యాన్స్ తో నిర్వహిస్తారని టాక్.