న‌య‌న‌తార ‘మిస్ట‌ర్ లోక‌ల్‌’ ట్రైల‌ర్‌ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 07:14 AM IST
న‌య‌న‌తార ‘మిస్ట‌ర్ లోక‌ల్‌’ ట్రైల‌ర్‌ రిలీజ్

Updated On : May 5, 2019 / 7:14 AM IST

‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కించిన చిత్రం మిస్టర్ లోకల్‌ లో శివకార్తికేయన్, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ మనోహార్ పాత్ర పోషించగా, నయనతార ..కేవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీఈవో కీర్తన వాసుదేవన్‌గా నటించింది. వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ ఫైట్స్‌ని ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. 
 
చిత్రానికి హిప్‌ హాప్ సంగీతం అందిస్తున్నారు. మే 1న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. నెలాఖ‌రుకి చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు టాక్. శివ కార్తికేయన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రిమది.