అంజలి సిబిఐ ఆఫీసర్‌గా నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అంజలి సిబిఐ ఆఫీసర్.. ఫిబ్రవరి 22న రిలీజ్.

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అంజలి సిబిఐ ఆఫీసర్.. ఫిబ్రవరి 22న రిలీజ్.
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా, తమిళనాట హిట్ అయిన ఇమైక్క నొడిగల్ సినిమా తెలుగులో అంజలి సిబిఐ ఆఫీసర్ పేరుతో రిలీజ్ కానుంది. తమిళ యంగ్ హీరో అథర్వ, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. కీ రోల్స్ చెయ్యగా, నయనతార భర్తగా, విజయ్ సేతుపతి స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. రాశీఖన్నా, అథర్వ లవర్‌గా నటించింది. ఆర్.అజయ్ గననముత్తు డైరెక్ట్ చేసాడు. ప్రస్తుతం, అంజలి సిబిఐ ఆఫీసర్ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న సినిమాని రిలీజ్ చెయ్యడానికి తెలుగు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం : హిప్ హాప్ తమిజా, కెమెరా : ఆర్.డి.రాజశేఖర్, ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్