Neha Chaudhary wants to take revenge on Bigg Boss contestants
Neha Chowdary : బిగ్‌బాస్ సీజన్ 6 అప్పుడే నాలుగోవారంలోకి వచ్చేసింది. ఈ సారి కొత్త కొత్త ట్విస్టులతో సాగుతోంది బిగ్‌బాస్. ఇక హౌస్ లోంచి ఎలిమినేట్ అయి బయటకి వచ్చినవాళ్లు మరింత ఫేమ్ అవ్వడానికి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు. కొంతమంది బిగ్‌బాస్ గురించి గొప్పగా చెప్తే మరికొంతమంది విమర్శలు కూడా చేస్తారు. తాజాగా మూడోవారంలో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన నేహా చౌదరి ఓ ఇంటర్వ్యూలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
BiggBoss 6 Day 22 : ఈ వారం నామినేషన్స్ లో ఉంది వీళ్ళే..
నేహా చౌదరి మాట్లాడుతూ.. ”హౌస్ లో నేను నమ్మినవాళ్లే ఇలా చేశారు. ముఖ్యంగా రేవంత్ వల్లే నేను బయటకి వచ్చేశాను. నేను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదు, చాలా షాకింగ్ కి గురయ్యాను ఎలిమినేట్ అయ్యాను అని తెలిసిన తర్వాత. అసలు నేను ఎందుకు బయటికి వచ్చానో నాకే తెలీదు, నాకంటే అసలు గేమ్ ఆడని వాళ్లు కూడా ఇంకా హౌస్‌లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ రూపంలో మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లే ఛాన్స్ వస్తే కచ్చితంగా వెళ్తాను. అసలే హౌస్ రివేంజ్ తీసుకోవాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు” అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి నేహా చౌదరికి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందా ఉండదా చూడాలి.