Jailer : జైలర్‌కి సీక్వెల్ రానుంది.. అలాగే ఆ సినిమాలకు కూడా సెకండ్ పార్ట్.. డైరెక్టర్ నెల్సన్ కామెంట్స్

రజినీకాంత్ జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ తీసుకు వస్తానంటూ డైరెక్టర్ నెల్సన్ తెలియజేశాడు. అలాగే..

Jailer : జైలర్‌కి సీక్వెల్ రానుంది.. అలాగే ఆ సినిమాలకు కూడా సెకండ్ పార్ట్.. డైరెక్టర్ నెల్సన్ కామెంట్స్

Nelson Dilip Kumar plan sequels for Jailer Beast Doctor kolamavu kokila movies

Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘జైలర్’. గత వారం రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ తీసుకు రావడానికి దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేస్తున్నాడట.

Bholaa Shankar – Jailer : వందేళ్ల సినిమా చరిత్రలో రికార్డు సృష్టించిన సినిమాలు.. అదేంటో తెలుసా..?

అయితే కేవలం ఈ చిత్రానికి మాత్రమే కాదు, మరో మూడు సినిమాలకు కూడా సీక్వెల్ తీసుకు వచ్చే ఆలోచన చేస్తున్నాడట. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? వాటిలో నటించిన స్టార్స్ ఎవరు? నెల్సన్ కుమార్ ఇప్పటి వరకు నాలుగు సినిమాలు తెరకెక్కించాడు. వీటిలో మొదటి సినిమా లేడీ ఓరియంటెడ్ కథ. నయనతార మెయిన్ లీడ్ లో బ్లాక్ కామెడీ క్రైమ్ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కో కో కోకిల’. 2018 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ తన రెండో సినిమా ‘డాక్టర్’ని తెరకెక్కించాడు. యాక్షన్ కామెడీతో 2021 లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.

Bholaa Shankar : రెమ్యూనరేషన్ విషయం చిరంజీవి, నిర్మాత గొడవ నిజమేనా..? వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్..

ఇక తన మూడో సినిమాని స్టార్ హీరో విజయ్ (Vijay) తో ‘బీస్ట్’ సినిమాగా తెరకెక్కించాడు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు జైలర్ తో పాటు ఈ మూడు చిత్రాలకు కూడా సీక్వెల్ తీసుకు వచ్చే ప్లానింగ్ లో నెల్సన్ ఉన్నట్లు జైలర్ మూవీ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అలాగే రజినీకాంత్ అండ్ విజయ్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించేలా ఒక సినిమా చేయడం తన డ్రీం ప్రాజెక్ట్ అని కూడా తెలియజేశాడు. మరి ఈ సీక్వెల్స్ తో పాటు ఈ డ్రీం ప్రాజెక్ట్ ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయో చూడాలి.