Nenu Meeku Baaga Kavalsinavaadini: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతూ వస్తోంది. కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Completes Censor Work
Nenu Meeku Baaga Kavalsinavaadini: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతూ వస్తోంది. దీంతో ఆయన్ను హీరోగా పెట్టి వరుస సినిమాలు తీస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీ రిలీజ్ వాయిదా.. కారణం ఏమిటో?
శ్రీధర్ గాదె డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో మరోసారి కిరణ్ అబ్బవరం తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరంపై సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి కామెంట్స్
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దామని.. ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ సినిమాను సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.