బోధిధర్మను పిలవమంటున్నారు – శృతిహాసన్
కరోనా ఎఫెక్ట్ : బోధిధర్మను పిలవమంటూ నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారంటున్న శృతి హాసన్..

కరోనా ఎఫెక్ట్ : బోధిధర్మను పిలవమంటూ నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారంటున్న శృతి హాసన్..
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించడం కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారు. సెలబ్రిటీల దగ్గరినుంచి సామాన్యుల వరకు ఇదే పరిస్థితి. తాజాగా శృతి హాసన్‌కు నెటిజన్లందరూ ఓ డిమాండ్ చేస్తున్నారట. బోధిధర్మని మళ్లీ తీసుకురమ్మంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట.
డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, సూర్య కాంబినేషన్‌లో ‘సెవెన్త్ సెన్స్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చైనా వల్ల వచ్చిన వైరస్ కారణంగా భారతదేశం తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. ఆ వైరస్ నాశనం కావాలంటే వందేళ్ల కిందటి బోధిధర్మని తీసుకురావడం ఒకటే మార్గమని జన్యు పరిశోధకురాలైన శ్రుతి తెలుసుకుని బోధిధర్మ వంశానికి చెందిన హీరోలో జన్యు పరిణామ క్రమం జరిపి వందేళ్ల కిందటి బోధిధర్మని మళ్లీ తీసుకొస్తుంది. అతను ఇచ్చిన మందు వల్ల వైరస్ నాశనమైపోతుంది.
Read Also : రాజువయ్యా.. మహరాజువయ్యా..
ఆ సినిమాలో చూపించినట్టుగానే దేశంలో వాస్తవ పరిస్థితి ఉంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం తీవ్ర విపత్తును ఎదుర్కొంటోంది. దీంతో బోధిధర్మని మళ్లీ తీసుకురమ్మని, ఈ మహమ్మారిని అరికట్టాలంటే ఆయన రావాల్సిందే.. ప్లీజ్.. ఎలాగైనా బోధిధర్మని పిలిపించు.. అంటూ నెటిజన్లందరూ శ్రుతికి మెసేజ్‌లు పెడుతున్నారట. సోషల్ మీడియా ద్వారా శ్రుతి ఈ విషయాన్ని వెల్లడించింది.