×
Ad

Nivetha Pethuraj : కుక్క కరిస్తే పెద్ద విషయం కాదట.. హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. భగ్గుమన్న నెటిజన్లు..

ఈ కార్యక్రమంలో నివేత పేతురేజ్ మాట్లాడిన మాటలు చర్చగా మారాయి. (Nivetha Pethuraj)

Nivetha Pethuraj

Nivetha Pethuraj : ఇటీవల వీధికుక్కలు చర్చగా మారాయి. ఓ పక్క వీధి కుక్కలు మనుషులను కరుస్తూ, అరుస్తూ ఇబ్బంది పెడుతుంటే మరోవైపు డాగ్ లవర్స్ మాత్రం వాటిని ఏమనొద్దు అంటున్నారు. ఈ విషయంలో గత కొన్నాళ్లుగా అటు సామాన్య ప్రజలకు – ఇటు డాగ్ లవర్స్ కి పెద్ద వివాదమే నడుస్తుంది. వాళ్ళు మాటలు చెప్తారు కాని వాళ్ళు మాత్రం వీధి కుక్కల్ని దత్తత తీసుకోరని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.(Nivetha Pethuraj)

తెలుగులో అల వైకుంఠపురంలో, పాగల్, రెడ్, దాస్ కా ధమ్కీ.. పలు సినిమాలతో మెప్పించిన నివేత పేతురేజ్ నేడు ఉదయం చెన్నైలో వీధి కుక్కల సంరక్షణ ర్యాలీ జరగ్గా అందులో పాల్గొంది. ఈ కార్యక్రమంలో నివేత పేతురేజ్ మాట్లాడిన మాటలు చర్చగా మారాయి.

Also Read : Producer SKN : నిర్మాతకు వచ్చేది కేవలం 17 పైసలే.. అసలు పాప్ కార్న్ తో మాకు సంబంధమే లేదు.. SKN ట్వీట్ వైరల్..

నివేతా మీడియాతో మాట్లాడుతూ.. కుక్క కాటుని అందరూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అది అంత పెద్ద విషయం కాదు. కుక్క కాటుని మనం పెద్దదిగా చూపించి ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నాము. దానికంటే క్రూరమైన ఘటనలు చాలా జరుగుతున్నాయి కానీ వాటి గురించి మాట్లాడట్లేదు. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ ప్రమాదకర వ్యాధి నిజమే కానీ దాని గురించి భయం వ్యాప్తి చేసేకంటే పరిష్కారం ఏంటో ప్రజలకు తెలియచేయాలి. వీధి కుక్కల్ని చంపడం పరిష్కారం కాదు అని మాట్లాడింది.

దీంతో నివేతాని తప్పుపడుతూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. కుక్క కరిస్తే ప్రమాదం కాకపోతే నువ్వు కరిపించుకో, పెళ్లి చేసుకొని దుబాయ్ కి వెళ్లేదానివి ఇక్కడ సమస్యలు నీకేం అర్థమవుతాయి, కార్లు వదిలేసి రాత్రి పూట రోడ్ల మీద తిరిగితే తెలుస్తుంది కుక్కల బాధ అంటూ పలువురు నెటిజన్లు నివేతాకు ఘాటుగా సమాధానమిస్తున్నారు. మరి దీనిపై నివేత ఏమైనా స్పందిస్తుందా చూడాలి.

Also Read : Dharmendra : స్టార్ హీరో మరణం.. 100 కోట్ల ఫామ్ హౌస్.. రెస్టారెంట్ బిజినెస్.. ఈయన ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా?

ఇటీవలే నివేతా పేతురాజ్ రాజ్ హిత్ ఇబ్రాన్ అనే దుబాయ్ బిజినెస్ మెన్ ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. 2026 జనవరిలో పెళ్లి చేసుకోనుంది. ఆ తర్వాత దుబాయ్ లోనే సెటిల్ అవ్వనున్నట్టు సమాచారం.