Nora Fatehi : నువ్వేమన్నా మహారాణివా?? నోరాపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..

ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే నోరా ఫతేహీ బాలీవుడ్ డ్యాన్స్‌ రియాలిటీ షో 'డ్యాన్స్‌ దీవానే జూనియర్స్‌'కు జడ్జిగా కూడా చేస్తుంది. తాజాగా ఈ షో షూటింగ్ లో పాల్గొనటానికి సెట్స్ కి రాగా.......

Nora Fatehi : నువ్వేమన్నా మహారాణివా?? నోరాపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..

Nora Fatehi

Updated On : July 6, 2022 / 6:54 AM IST

Nora Fatehi :  బాలీవుడ్‌ భామ, ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహీ వరుస సినిమాలు, ఐటెం సాంగ్స్ తో బిజీబిజీగా ఉంది. తెలుగులో టెంపర్‌, బాహుబలి లాంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో తెలుగు వారికి దగ్గరైంది. హిందీలో అయితే ఈ అమ్మడికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె వీడియో ఒకటి వైరల్ అవ్వగా ఆ వీడియో చూసిన నెటిజన్లు నోరాని ట్రోల్ చేస్తున్నారు.

ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే నోరా ఫతేహీ బాలీవుడ్ డ్యాన్స్‌ రియాలిటీ షో ‘డ్యాన్స్‌ దీవానే జూనియర్స్‌’కు జడ్జిగా కూడా చేస్తుంది. తాజాగా ఈ షో షూటింగ్ లో పాల్గొనటానికి సెట్స్ కి రాగా ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది. అయితే కారులోంచి దిగి క్యారవాన్ లోకి వెళ్ళడానికి కేవలం ఒక అయిదు అడుగుల దూరమే ఉంది. ఆ సమయంలో నోరా చీర కట్టుకొని ఉండటంతో కారులోంచి దిగి క్యారవాన్ వరకు వెళ్లేంతవరకు ఆమె బాడీగార్డ్ నీటిలో చీర తడిసిపోతుందని ఆమె చీరను పట్టుకొని వెనకాలే వర్షంలో నడిచాడు. ఇంకొక బాడీగార్డ్ ఆమెకి గొడుగు పట్టుకున్నాడు.

Lavanya Tripathi : నా కోసం కథ రాసుకున్నారు.. 9 కిలోల బరువు ఉన్న గన్స్‌ పట్టుకుని షూట్ చేయడం చాలా కష్టం..

దీంతో ఈ వీడియో చుసిన నెటిజన్లు నోరా ఫతేహీని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయిదు అడుగులు కూడా వేయలేకపోయావా? వెనకాల నీ చీర పట్టుకొని నడవాలా నువ్వేమన్నా మహారాణివా? చీరని క్యారీ చేయడం రానప్పుడు ఎందుకు కట్టుకున్నావు? కనీసం అతనికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు.. అంటూ ఇలా రకరకాల కామెంట్స్ తో నోరాని ట్రోల్ చేస్తున్నారు. మరి దీనికి నోరా సమాధానమిస్తుందా చూడాలి.

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)