Lasya : నాన్నకి ఇల్లు కట్టిస్తున్నయాంకర్ లాస్య
లాస్య తన సొంతూరులో వాళ్ళ నాన్నకి ఇల్లు కట్టిస్తున్నట్టు తెలిపింది. వాళ్ళ నాన్నకి కట్టిస్తున్న ఇంటిని చూపిస్తూ.. ''నేను చిన్నప్పుడు ఉన్న ఇంటిని ఆ మధ్య కూలగొట్టాం కదా...........
Lasya : ఒకప్పుడు బుల్లితెరపై ఫేమస్ యాంకర్ గా చక్రం తిప్పింది యాంకర్ లాస్య. రవితో కలిసి చాలా షోలకి యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత కొన్నేళ్ళకి పెళ్లి చేసుకొని టీవీకి దూరమైంది. కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ గత రెండు సంవత్సరాల నుంచి టీవీ షోలలో పార్టిసిపేట్ చేస్తుంది. యాంకర్ గా కాకపోయినా ఇటీవల అన్ని షోలలోను కనపడి ఎంటర్టైన్ చేస్తుంది లాస్య. దాంతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతూ బిజీగా గడిపేస్తుంది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో కొత్త వీడియో పోస్ట్ చేసింది.
Chiranjeevi : సమ్మర్ బరిలో మెగాస్టార్.. ఏప్రిల్ 1న ‘ఆచార్య’
ఈ వీడియోలో లాస్య తన సొంతూరులో వాళ్ళ నాన్నకి ఇల్లు కట్టిస్తున్నట్టు తెలిపింది. వాళ్ళ నాన్నకి కట్టిస్తున్న ఇంటిని చూపిస్తూ.. ”నేను చిన్నప్పుడు ఉన్న ఇంటిని ఆ మధ్య కూలగొట్టాం కదా.. దాని స్థానంలో కొత్తింటిని కట్టిస్తున్నాము. ఇప్పటికే అది చాలావరకు పూర్తయింది. నాన్న కళ్లలో ఆనందం చూడటానికి నేనేదైనా చేస్తాను. ఆయన సంతోషం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఆయన కోసం ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్నాను.” అని తెలిపింది. మళ్ళీ గృహప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా పూర్తి అయిన ఇంటిని చూపిస్తానని తెలిపింది. అలాగే తన తండ్రికి గతంలో గిఫ్ట్ ఇచ్చిన ట్రాక్టర్ను చూపిస్తూ వాళ్ళ నాన్న తోలుతూ ఉంటే అందులో తన కొడుకుతో పాటు ఎక్కి తిరిగింది.