I 20 Movie : ‘ఐ 20.. అమ్మాయిలతో జాగ్రత్త’.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
ఐ 20 రొమాంటిక్ కామెడీ క్రైం ఎంటర్టైనర్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు.
New Movie I 20 Release Date Announced
I 20 Movie : సూర్యరాజ్, మెరీనా సింగ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఐ – 20’. బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పి.బి.మహేంద్ర నిర్మాణంలో సూగూరి రవీంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ ఐ 20 రొమాంటిక్ కామెడీ క్రైం ఎంటర్టైనర్ సినిమా అని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. ఐ 20 సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో ఒక లవ్, బ్రేకప్ స్టోరీతో పాటు, అమ్మాయిల కిడ్నాప్ లతో కథాంశం ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
Also Read : Kanchana 4 : రాఘవ లారెన్స్ ‘కాంచన 4’ వచ్చేస్తోంది..
రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ.. జూన్ 7నే సినిమా విడుదల అచేద్దాం అనుకున్నాం. కనై చాలా సినిమాలు ఉన్నాయి అందుకే జూన్ 14న వస్తున్నాం. ఆడవాళ్ళని గౌరవించాలి అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంటుంది అని తెలిపారు.
https://www.youtube.com/watch?v=_ftq9OSMWoM
