Kanchana 4 : రాఘ‌వ లారెన్స్ ‘కాంచ‌న 4’ వ‌చ్చేస్తోంది..

ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ కాంచ‌న‌.

Kanchana 4 : రాఘ‌వ లారెన్స్ ‘కాంచ‌న 4’ వ‌చ్చేస్తోంది..

Raghava Lawrence kanchana 4 shoot begin in September 2024

Updated On : June 6, 2024 / 6:10 PM IST

Raghava Lawrence kanchana 4 : ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ కాంచ‌న‌. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ విజ‌యాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లో మూడు సినిమాలు రాగా ఈ మూడు మూవీలు కూడా భారీ విజ‌యాల‌ను అందుకున్నాయి. కాగా.. తాజాగా ఈ సిరీస్‌లో నాలుగో మూవీని తెర‌కెక్కించనున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ మూవీకి కూడా లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. ‘కాంచ‌న 4’ గా ఇది రానుంది. ఈ చిత్ర షూటింగ్‌ను సెప్టెంబ‌ర్‌లో మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ మూవీని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

Chiranjeevi – Pawan Kalyan : చిరంజీవి కాళ్లకు నమస్కరించిన పవన్.. తమ్ముడి విజయంపై ఆనంద భాష్పాలతో మెగాస్టార్

2011లో కాంచ‌న విడుద‌లై ఘ‌న విజయాన్ని అందుకుంది. 2015లో రెండో పార్టును రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. 2019లో కాంచ‌న-3ను తీసుకురాగా విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ మూడు పార్టుల్లోనూ రాఘ‌వ లారెన్స్, కోవై సరళల కామెడీ అంద‌రిని అల‌రించింది. ఈ మూవీల్లో రాయ్ ల‌క్ష్మీ, వేదిక, నిత్యా మీనన్, తాప్సీ పన్నులు కథానాయికలుగా నటించారు. మ‌రీ కాంచ‌న 4లో ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తారు అన్న విష‌యాల‌ను ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.