Movie Opening : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హిట్ తర్వాత మరో కొత్త సినిమా ఓపెనింగ్..
తాజాగా ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. (Movie Opening)
Movie Opening
Movie Opening : ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే చిన్న సినిమాతో మంచి విజయం అందుకున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా కొత్త సినిమా మొదలుపెట్టింది. ‘ఇ.ఎం.ఐ’ అనే టైటిల్ తో కొత్తవాళ్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్టైనర్ గా నిఖిల్ కువ్వరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న దరహాస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్ర పోషించిన శైలజ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
తాజాగా ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు.
Also Read : Romanchakam Review : ‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. సందీప్ రెడ్డి వంగ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే..?
బైక్, కారు, ఫోన్, ఇల్లు..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత వాటిని కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని మూవీ యూనిట్ ప్రకటించారు. అలాగే ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో భారీ సినిమాని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
