MAA Elections: కొత్త ట్విస్ట్.. ‘మా’ ఎన్నికల బరిలో బాబుమోహన్?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 956 మంది సభ్యులున్న సంఘానికి ఇప్పటికే అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడనున్నట్లు..

MAA Elections: కొత్త ట్విస్ట్.. ‘మా’ ఎన్నికల బరిలో బాబుమోహన్?

Maa Elections

Updated On : September 11, 2021 / 11:01 AM IST

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 956 మంది సభ్యులున్న సంఘానికి ఇప్పటికే అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడనున్నట్లు ప్రకటించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు మా ఎలక్షన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఎవరికి వారు ఓట్లు తమకే పడేలా తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు. ఇందులో ఐదుగురు పోటీలో ఉన్నా.. ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్యే ప్రధానంగా పోరు సాగనుంది.

Sudheer-Rashmi: తొమ్మిదేళ్ల ప్రేమకు శుభం కార్డ్.. పెళ్లి పీటలెక్కుతారా?

మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాశ్‌ రాజ్.. కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవిత, హేమ మహిళా కార్డుతో పోటీకి సై అంటున్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ ఖరారు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సాధారణ రాజీయ ఎన్నికలను తలపించేలా హీట్ పెంచేసిన ఈ ఎన్నికలలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటుచేసుకోనున్నట్లు తెలుస్తుంది.

Big Boss 5: ఎలిమినేషన్‏లో ఆరుగురు.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

సీనియర్ నటుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాబుమోహన్ కూడా మా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఆయన దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ఐదుగురిలో ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు మధ్య ప్రధాన పోటీ నెలకొనగా ఇప్పుడు బాబు మోహన్ రేసులో చేరితే ఎన్నికల ప్రచారం కొత్త మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నారు.