Salaar Movie Update
Salaar Movie Update : రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ అండ్ టీం ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది. మేకర్స్ మెగా సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారట.
ఈ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ప్రశాంత్ నీల్ టీం ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మాస్ స్టైల్ లో ఈ పాట సాగనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ రెండు విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారు. సలార్ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.. ప్రస్తుతం జగపతిబాబుకు సంబందించిన సీన్స్ ని శరవేగంగా తీస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో శృతిహాసన్ పొలిటికల్ జర్నలిస్టుగా కీ రోల్‌లో మెరువనుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 2022లో సలార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. మరోవైపు ఓం రావత్ డైరెక్షన్ లో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్టు kతో సినిమాలతో బిజీగా కానున్నాడు ప్రభాస్.