ఎన్‌జీకే- జూక్ బాక్స్

రీసెంట్‌గా ఎన్‌జీకే సాంగ్స్ ఆన్ లైన్‌లోకి వచ్చేసాయి. తమిళ్‌తో పాటు, తెలుగు పాటలను ఒకేసారి విడుదల చేసారు..

  • Published By: sekhar ,Published On : April 30, 2019 / 11:14 AM IST
ఎన్‌జీకే- జూక్ బాక్స్

Updated On : May 28, 2020 / 3:40 PM IST

రీసెంట్‌గా ఎన్‌జీకే సాంగ్స్ ఆన్ లైన్‌లోకి వచ్చేసాయి. తమిళ్‌తో పాటు, తెలుగు పాటలను ఒకేసారి విడుదల చేసారు..

తమిళ స్టార్ హీరో సూర్య, శ్రీ రాఘవ కాంబినేషన్ లో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్.. ఎన్‌జీకే.. (నంద గోపాల కృష్ణ).. సాయి పల్లవి, సూర్య భార్యగా నటించగా, రకుల్ ప్రీత్ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సమర్పణలో, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఎన్‌జీకే టీజర్ అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఎన్‌జీకే సాంగ్స్ ఆన్ లైన్‌లోకి వచ్చేసాయి. తమిళ్‌తో పాటు, తెలుగు పాటలను ఒకేసారి విడుదల చేసారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ఆల్బమ్‌లో మొత్తం నాలుగు పాటలున్నాయి.
Also Read : చైతూ సినిమాలో ‘RX 100’ హీరో!

‘వడ్డీలోడు వచ్చెనే’ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాయగా, సత్యన్ పాడాడు. ‘తిరగబడు తిరగబడు’ పాటకూ చంద్రబోస్ పదాలు రాస్తే, జితిన్ రాజ్ పాడాడు. ‘ప్రేమా ఓ ప్రేమా’ అనే చక్కటి మెలోడీకి చంద్రబోస్ లిరిక్స్ రాస్తే, సిడ్ శ్రీరామ్, హేమాంబిక పాడారు. ‘అణచివేసిన’ రాజేష్ ఎ.మూర్తి లిరిక్స్ రాయగా, శరత్ సంతోష్ పాడాడు. నాలుగు పాటలూ వేటికవే వైవిధ్యంగా, వినసొంపుగా ఉన్నాయి. సినిమాలో ప్రతి పాట సందర్భానికి తగ్గట్టు ఉంటాయని అనిపిస్తుంది. దేవరాజ్, మన్సూర్ అలీఖాన్, తలైవాసల్ విజయ్ తదితరులు నటించిన ఎన్‌జీకే, మే 31న తెలుగు, తమిళ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్, ఎన్‌జీకే సాంగ్స్..