దొరికిపోయారు.. ప్రియాంక భర్త కెమెరాలో విక్కీతో కత్రినా..

  • Published By: sekhar ,Published On : July 21, 2020 / 02:50 PM IST
దొరికిపోయారు.. ప్రియాంక భర్త కెమెరాలో విక్కీతో కత్రినా..

Updated On : July 21, 2020 / 3:35 PM IST

పాతదే అయినా ఓ వార్త ఇప్పుడు మీడియా అండ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలుమార్లు మీడియా కంట పడ్డారు. ప్రేమ విషయమై ఇప్పటివరకు ఇద్దరిలో ఎవరూ నోరు విప్పలేదు. అయితే వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనడానికి ఇదిగో సాక్ష్యం అన్నట్టు పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Vicky Kaushal-Katrina Kaif

గతంలో ముఖేష్ అంబాని కుమార్తె ఇషా అంబాని హోలీ బాష్‌లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రియాంక భర్త నిక్‌తో కలిసి అటెండ్ అయింది. కత్రినా, విక్కీ కూడా అందరితో కలిసి సరదాగా హోలీ ఆడారు. నిక్ అనుకోకుండా ఆ హంగామా అంతటినీ వీడియో తీశాడు.

Vicky Kaushal-Katrina Kaif

అదుగో కరెక్ట్‌గా అక్కడ కెమెరా కంటపడి దొరికిపోయారు ప్రేమ పక్షులు విక్కీ, కత్రినా.. ఆ వీడియోలో విక్కీ, కత్రినా హోలీ ఆడుతూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. ప్రేమ, డేటింగ్ అంటే ఏం మాట్లాడడం లేదు.. ఈ వీడియో చూస్తే తెలుస్తుందిలే.. అందుకే సైలెంట్‌గా ఉన్నారు.. అంటూ బాలీవుడ్ బాబులు గుసగుసలాడుతున్నారు. ఈ వార్తలపై విక్కీ, కత్రినా ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

https://www.instagram.com/p/B9an2dzBqM6/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again