Nidhhi Agerwal Gives Clarity on Contract with Pawan Kalyan HariHara VeeraMallu Movie
Nidhhi Agerwal : నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చి అనంతరం మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే నిధి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఒప్పుకున్న తర్వాత ఏ సినిమాని ఓకే చేయలేదు. ఇటీవల నిధి ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.
అయితే కరోనా ముందే 2019 లోనే హరిహర వీరమల్లు సినిమాకు నిధి అగర్వాల్ ఓకే చెప్పింది. అప్పట్నుంచి రీసెంట్ గా రాజాసాబ్ వరకు ఏ సినిమా ఓకే చేయకపోవడంపై గతంలో పలు వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు నిధి ఒకే ప్రాజెక్టు పై ఉండాల్సి వచ్చింది. తాజాగా నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
Also Read : Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ అక్కడే.. భారీగా.. నిర్మాత వ్యాఖ్యలు..
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నేను లాక్ డౌన్ ముందే హరిహర వీరమల్లు సినిమాకు సైన్ చేశాను. పవన్ కళ్యాణ్ సర్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా ఇవ్వాలని, కాబట్టి సినిమా అయ్యేంతవరకు వేరే సినిమా ఒప్పుకోకూడదని కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను. కానీ ఆ సినిమా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పట్టింది. ఈ గ్యాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఆ కాంట్రాక్టు వల్లే వేరే ఏ సినిమా ఒప్పుకోలేదు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా రావడంతో ఆ సినిమా వదులుకోకూడదు అని హారోహర వీరమల్లు మూవీ టీమ్ తో మాట్లాడి, రిక్వెస్ట్ చేసి, షూటింగ్స్ కి క్లాష్ రానివ్వను అని చెప్పి రాజాసాబ్ సినిమాకు ఓకే చెప్పాను. కానీ అనుకోకుండా రెండు షూటింగ్స్ ఒకేసారి రావడంతో కొన్ని రోజులు డబల్ షిఫ్ట్ చేశాను. ఒకే రోజు విజయవాడ, హైదరాబాద్ లో షూటింగ్స్ చేసిన రోజులు ఉన్నాయి. అది నా కాంట్రాక్టు కాబట్టి, నేను ఒప్పుకొనే సంతకం పెట్టాను కాబట్టి దీనిపై ఎవర్ని అనలేను. కొన్ని ఛాన్సులు పోవడం వల్ల బాధపడ్డాను కానీ ఈ సినిమాలు పెద్ద సినిమాలు, ఎదురుచూసిన దానికి ఫలితం ఉంటుంది అని తెలిపింది.
హరిహర వీరమల్లు ఇంకో వారం రోజులు మాత్రమే షూట్ మిగిలి ఉందని ఇటీవల పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో ఈ సినిమా షూట్ అవ్వగానే నిధి రాజాసాబ్ కి పూర్తి టైం కేటాయిస్తూనే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటుందని తెలుస్తుంది. ఆమె ఫ్యాన్స్ కూడా త్వరగా ఎక్కువ సినిమాలు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది నిధి. హరిహర వీరమల్లు సినిమాలో నిధి పంచమి అనే పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా పార్ట్ 1 మార్చ్ 28న రిలీజ్ కానుంది.
Also Read : Akkineni Family : ‘అక్కినేని కజిన్స్’ ఫోటో వైరల్.. అక్కినేని ఇంట సంక్రాంతి మొదలు.. కొత్త జంట కూడా ఉందిగా..