Nidhhi Agerwal : గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా.. ‘దిఎలైట్ హోటల్’ ప్రారంభం..
గచ్చిబౌలి రోడ్‌లోని ఓల్డ్ హఫీజ్‌పేట్ లో ఈ రోజు ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా `ది ఎలైట్ హోటల్` గ్రాండ్ గా ప్రారంభమైంది.

Nidhhi Agerwal opened the elite hotel in hyderabad
Nidhhi Agerwal : గచ్చిబౌలి రోడ్‌లోని ఓల్డ్ హఫీజ్‌పేట్ లో ఈ రోజు ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా `ది ఎలైట్ హోటల్` గ్రాండ్ గా ప్రారంభమైంది. బి.శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, టి. జగదీశ్వర్ రెడ్డి, వి. విష్ణువర్ధన్‌రెడ్డి లు నిర్వహిస్తోన్న ఈ హోటల్ ప్రారంభోత్సవానికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ప్రముఖ దర్శకులు సంపత్ నంది, విరూపాక్ష దర్శకులు కార్తిక్ దండు ముఖ్య అతిథులుగా విచ్చేసారు.
‘దిఎలైట్ హోటల్’ ప్రారంభించిన అనంతరం నిధి అగర్వాల్ మాట్లాడుతూ… ది ఎలైట్ హోటల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. హోటల్ చూడటానికి చాలా బావుంది. ఇందులో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక మీదట నేను ఎప్పుడూ హైదరాబాద్ వచ్చినా ఇదే హోటల్ లో స్టే చేస్తాను. ది ఎలైట్ హోటల్ వారు ఇంకా ఎన్నో హోటల్స్ ప్రారంభించాలని కోరుకుంటూ హోటల్ అధినేతలు బి.శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి గార్లకు నా శుభాకాంక్షలు అని తెలిపారు.
మంచిర్యాల్ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ… ది ఎలైట్ హోటల్ యాజమాన్యం వారు బాగా కావాల్సిన వారు కావడంతో ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ హోటల్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ హోటల్ అధినేతలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని అన్నారు.
విరూపాక్ష డైరక్టర్ కార్తిక్ దండు మాట్లాడుతూ… హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్ లో ‘ది ఎలైట్ హోటల్’ ప్రారంభించారు. హోటల్ లో రూమ్స్ చాలా బావున్నాయి. ఫుడ్ కూడా చాలా అథంటిక్ గా, టేస్టీగా ఉంది. ఈ హోటల్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ది ఎలైట్ హోటల్ వారికి నా శుభాకాంక్షలు అని తెలిపారు.
‘ది ఎలైట్ హోటల్’ అధినేతలు మాట్లాడుతూ… మా ది ఎలైట్ హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ మా ధన్యవాదాలు. కొంత మంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ హోటల్ ప్రారంభించాం. ఒక మంచి విజన్ తో ఈ హోటల్ ప్రారంభించాం. రానున్న ఐదేళ్లలో వివిధ ప్రాంతాల్లో మరో పదిహేను హోటల్స్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నాం. ఇది మా ఫస్ట్ హోటల్. 72 రూమ్స్ తో ప్రారంభించాము. పులావ్ పట్నం పేరుతో ఎన్నో డెలిషియస్ వెరైటీస్ అందిస్తున్నాం. ఏ కార్పోరేట్ గెస్ట్ హైదరాబాద్ వచ్చినా వారికి అన్ని విధాలుగా ఎంతో కంఫర్ట్ బుల్ గా మా హోటల్ ఉంటుంది. మా హోటల్ చుట్టూ ఎన్నో షాపింగ్ మాల్స్, బార్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎన్నో ఫుడ్ వెరైటీస్, ఎంతో సౌకర్యాన్ని గెస్ట్ లకు అందించడమే మా హోటల్ లక్ష్యం అని అన్నారు.