Nidhhi Agerwal : రాజా సాబ్ నుంచి వ‌ర్కింగ్ స్టిల్‌ను షేర్ చేసిన నిధి అగ‌ర్వాల్‌

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం ది రాజా సాబ్‌.

Nidhhi Agerwal shares working still from The Raja Saab movie

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు.

హారర్, రొమాంటిక్, కామెడీ క‌థాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా.. నేడు (అక్టోబ‌ర్ 8) ద‌ర్శ‌కుడు మారుతి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతితో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఆయ‌నకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌ను నిధి అగ‌ర్వాల్ తెలియ‌జేసింది.

Malavika Mohanan : ఆ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ చేసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్.. ‘రాజాసాబ్’ షూట్ అయిపోయిందా?

“ప్రియమైన దర్శకుడు మారుతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు స‌ర్‌. సినిమా పట్ల మీ అభిరుచి, ప్రేమను ప్రపంచం త్వరలో చూడబోతోంది. మీకు అంతా మంచే జ‌ర‌గాల‌ని, మీ జీవితం ఆనంద మ‌యం కావాల‌ని కోరుకుంటున్నాను.” అని నిధి అగ‌ర్వాల్ ట్వీట్ చేసింది.