Niharika Husband : అపార్ట్ మెంట్ గొడవపై నిహారిక భర్త క్లారిటీ
అపార్ట్ మెంట్ఖ గొడవపై మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అసలు గొడవకు గల కారణాలను చెప్పారు. ఇరువురు మాట్లాడుకున్నట్లు...సమస్యను పరిష్కరించుకున్నట్లు వెల్లడించారు.

Niharika
Chaitanya Clarification : అపార్ట్ మెంట్ గొడవపై మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అసలు గొడవకు గల కారణాలను చెప్పారు. ఇరువురు మాట్లాడుకున్నట్లు…సమస్యను పరిష్కరించుకున్నట్లు వెల్లడించారు. అటు అపార్ట్ మెంట్ వాసులు, తాను ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నట్లు చైతన్య తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్ మెంట్ లో చైతన్య, నిహారిక దంపతులు ఉంటున్నారు.
Read More : Vaccinated People : కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి..వైరస్ ముప్పు 3 రెట్లు తక్కువ
తాను అపార్ట్ మెంట్ లో ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకోవడం జరిగిందని, అసలు తాను ఎందుకు ప్లాట్ తీసుకున్నానో ఓనర్ కు తెలియచేయడం జరిగిందన్నారు. చాలా రోజుల నుంచి ఈ ప్లాట్ అద్దెకు తీసుకున్నట్లు..ఇందులో ప్రొడక్షన్, ఆఫీసు పని నిమిత్తానికి మాత్రమే గది ఉపయోగించడం జరుగుతోందన్నారు. ఈ విషయం అపార్ట్ మెంట్ వాసులకు క్లారిటీ లేకపోవడంతోనే గొడవ జరిగిందన్నారు.
Read More : Samsung Galaxy F62 : సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
ఆఫీసు పర్పస్ గా ఉపయోగించామని, కమర్షియల్ పర్పస్ కాదని స్పష్టం చేశారు. కానీ..దీనిని అపార్ట్ మెంట్ అసోసియేషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అయితే…గురువారం 25 మంది డోర్ బాదడంతో తాను మొదటగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, కానీ…నాపై కేసు నమోదైనట్లు ప్రచారం జరిగిందని తెలిపారు. ఇది అవాస్తవమన్నారు. గొడవపై ఇరువురం..మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడం జరిగిందన్నారు.