నేడే మెగా డాటర్ నిహారికా, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం..

  • Published By: sekhar ,Published On : August 13, 2020 / 01:51 PM IST
నేడే మెగా డాటర్ నిహారికా, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం..

Updated On : August 13, 2020 / 2:05 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం జరుగబోతోంది.

తాజాగా నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలిపారు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు.. ఆగస్టు 13 గురువారం రాత్రి 8గంటలకు హైదరాబా‌ద్‌లో ఎంగేజ్‌మెంట్ జరుగనుంది.

ప్రస్తుత కోరనా పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరు కుటుంబాల పెద్దలు మరియు సన్నిహితులు సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు నిహారికా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన IG జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం స్నేహితులు.