Site icon 10TV Telugu

Madraskaaran : ‘మద్రాస్ కారన్’ మూవీ రివ్యూ.. నిహారిక తమిళ సినిమా ఎలా ఉందంటే..

Niharika Shane Nigam Madraskaaran Movie Review

Niharika Shane Nigam Madraskaaran Movie Review

Madraskaaran Movie Review : షేన్ నిగమ్, నిహారిక జంటగా తమిళ్ లో తెరకెక్కిన సినిమా ‘మద్రాస్ కారన్’. జగదీశ్ నిర్మాణంలో వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో సంక్రాంతికి జనవరి 10న థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ తో వచ్చింది.

కథ విషయానికొస్తే.. సత్య(షేన్ నిగమ్), మీరా(నిహారిక) ప్రేమించి పెళ్లి చేసుకోబోతారు. సత్య తన సొంతూళ్లో పెళ్లి పెట్టుకుంటాడు. రేప్పొద్దున్నే పెళ్లి అనగా మీరా కలుద్దాం అనడంతో ఆమె ఉన్న హోటల్ కి కార్ లో బయలుదేరుతాడు సత్య. ఈ దారిలో ఓ ప్రగ్నెంట్ లేడీ(ఐశ్వర్య దుత్త)ని కార్ తో గుద్దేస్తాడు. దీంతో ఆమెని హాస్పిటల్ లో చేర్పించినా ఆమె మనుషులు ఇతన్ని వదిలిపెట్టేది లేదు అని కొడతారు. బిడ్డకి, తల్లికి ఎవరికైనా ఏమన్నా అయితే సత్యని చంపేస్తామని ఆమె భర్త(కలైరాసన్), ఆమె అన్న బెదిరిస్తారు.

బిడ్డ చనిపోయింది అని తెలియడంతో సత్య తప్పు ఒప్పుకొని జైలుకు వెళ్తాడు. దీంతో పెళ్లి ఆగిపోతుంది. రెండేళ్ల తర్వాత సత్య జైలు నుంచి బయటకు వచ్చాక అసలు ఆ బిడ్డ తన వల్ల చనిపోలేదు అని ఓ నర్స్ చెప్తుంది. అదే సమయంలో అతనిపై ఎవరో దాడి చేస్తారు. అసలు ప్రగ్నెంట్ మహిళ కడుపులో బిడ్డ ఎలా చనిపోయింది? సత్య పై దాడి చేసింది ఎవరు? సత్య వల్ల బిడ్డ చనిపోలేదని ఏం చేసాడు? మీరా ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Tamil Stars : పేరు పక్క ట్యాగ్స్ వద్దంటున్న తమిళ స్టార్స్.. సడెన్ గా ఏమైందో.. లిస్ట్ పెరుగుతుందిగా..

సినిమా విశ్లేషణ.. సినిమా ఓపెనింగ్ ఓ పెళ్లి సాంగ్ తో మొదలుపెడతారు. రేప్పొద్దున్నే పెళ్లి అని క్లారిటీ ఇచ్చేసి పాత్రలను పరిచయం చేస్తారు. ఆ పెళ్లి గోల కాస్త బోర్ కొడుతుంది. సత్య కార్ తో ప్రగ్నెంట్ మహిళని యాక్సిండెంట్ చేసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. సత్య తప్పు ఒప్పుకొని జైలుకి వెళ్లడంతో కాస్త ఎమోషన్ వర్కౌట్ చేసినా ఇంతేనా కథ నెక్స్ట్ ఏంటి అనిపిస్తుంది. కానీ అసలు కథ సత్య జైలు నుంచి బయటకు వచ్చాక అతని వల్ల కడుపులో బిడ్డ చనిపోలేదు అని తెలియడంతో ఎవరు చేశారు మరి అని ఆ ఊరికి మళ్ళీ వెళ్లడంతో కథ కథనం ఆసక్తిగా మారతాయి.

సెకండ్ హాఫ్ అంతా ఆ కడుపులో ఉండే బిడ్డని ఎవరు చంపారు అనే సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అక్కడక్కడా కాస్త ఎమోషన్ వర్కౌట్ చేశారు. సినిమాలో ఒకప్పటి సఖి మూవీ సాంగ్ ని రీమిక్స్ చేసి నిహారిక – షేన్ మధ్య పెట్టారు. ఈ సాంగ్ అవసర్లేకపోయినా పెట్టారు అనిపిస్తుంది. ఈ పాటలో నిహారిక కాస్త బోల్డ్ గా కనిపిస్తుంది. ఇక మద్రాస్ కారన్ అంటే మద్రాస్ నుంచి వచ్చిన వ్యక్తి అని. ఇందులో మద్రాస్ లో సెటిల్ అయిన హీరో పెళ్లి ఒకప్పుడు తన తల్లితండ్రులు ఉన్న ఊర్లో చేసుకోవాలని వస్తాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. షేన్ నిగమ్ చాలా బాగా నటించాడు. నిహారిక కొద్ది సేపు మాత్రమే కనిపిస్తుంది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కూడా కాదు అది. కలైరాసన్ కూడా చక్కగా నటించాడు. ఐశ్వర్య దుత్త చివర్లో ఎమోషన్ పండిస్తోంది. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపిస్తారు.

Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్.. అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే.. మరో పక్క..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఆ విజువల్స్, సీన్స్ చూస్తేనే తమిళ్ సినిమా అని అర్థమైపోతుంది. తెలుగు డబ్బింగ్ మాత్రం ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. కనీసం నిహారిక పాత్ర డబ్బింగ్ అయినా నిహారికతో చెప్పించాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. పాటలు జస్ట్ ఓకే. మంచి సాంగ్ ని అనవసరంగా రీమిక్స్ చేశారు అనిపిస్తుంది. దర్శకుడు ఓ కొత్త కథతో ఆసక్తికర కథనంతో బాగానే రాసుకున్నాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు.

మొత్తంగా ‘మద్రాస్ కారన్’ సినిమా రేపు పెళ్లి అనగా అనుకోకుండా ఓ యాక్సిడెంట్ చేసి జైలుకెళ్లిన జైలు నుంచి వచ్చాక తన వల్ల తప్పు జరగలేదని తెలిసి ఏం చేసాడు అని సస్పెన్స్ కథాంశంతో బాగానే తెరకెక్కించారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Exit mobile version