నితిన్, షాలిని పెళ్లి డేట్ ఫిక్స్!

కరోనా కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్, షాలిని వివాహానికి సంబంధించి ఫిబ్రవరిలోనే పసుపు కుంకుమ ఫంక్షన్‌ను ముగించారు. ఆ తర్వాత చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లిని జరపాలని ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ కరోనా రూపంలో వారి ఆశలు నెరవేరలేదు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత గ్రాండ్‌గా నితిన్, షాలినిల పెళ్లి జరపాలని వాయిదా వేస్తూ వస్తున్నారు. కానీ కరోనా ఇప్పటిలో అంతం అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. ఇరు కుటుంబాలకు సంబంధించిన వారి సమక్షంలో నితిన్, షాలినిల పెళ్లి
జరపాలని వారి కుటుంబ సభ్యులు ఫిక్సయ్యారు.
నితిన్, షాలినీల వివాహం జూలై 26 సాయంత్రం 8గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరపనున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరుకానున్నారని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ‘భీష్మ’ సక్సెస్‌లో ఉన్న నితిన్.. ‘రంగ్ దే’, ‘అంధాధున్ రీమేక్’, ‘పవర్ పేట’, ‘చెక్’ సినిమాల్లో నటిస్తున్నాడు నితిన్.