Nithya Menon : అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటా.. అప్ప‌టి వ‌ర‌కు నో మ్యారేజ్ : నిత్యామీన‌న్‌

నిత్యా మీన‌న్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. అలా మొద‌లైంది సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

Nithya Menon : అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటా.. అప్ప‌టి వ‌ర‌కు నో మ్యారేజ్ : నిత్యామీన‌న్‌

Nithya Menen

Updated On : October 29, 2023 / 7:29 PM IST

Nithya Menen comments : నిత్యా మీన‌న్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. అలా మొద‌లైంది సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల గుండెల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ బాష‌ల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు వెబ్ సిరీసుల్లో న‌టిస్తూ అల‌రిస్తోంది. ఇటీవ‌లే కుమారి శ్రీమతి అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తాజాగా ఆమె ప్రధాన పాత్ర‌లో న‌టించిన‌ మలయాళ వెబ్‌ సిరీస్‌ ‘మాస్టర్‌ పీస్‌’ కూడా స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది.

ఈ వెబ్ సిరీస్‌లో ఆమె రియా అనే గృహిణి పాత్ర‌లో న‌టించింది. రీల్ లైఫ్‌లో గృహిణిగా ఆక‌ట్టుకున్న నిత్య రియ‌ల్ లైఫ్‌లో త‌న‌కు ఎలాంటి భ‌ర్త కావాల‌ని అనుకుంటుందో చెప్పింది. తాను ప‌క్కా ట్రెడిష‌న‌ల్ అని చెప్పుకొచ్చింది. మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తాన‌ని అంది. అయితే.. పెళ్లి విష‌యంలో త‌న‌కు ఓ అభిప్రాయం ఉంద‌ని తెలిపింది. మ్యారేజ్ అనేది సోష‌ల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్‌ అని అంది. త‌న‌కు అలాంటి సెక్యూరిటీ అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చింది. అంత‌కు మించి ఆలోచించే వాళ్లు దొరికితే త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటాన‌ని నిత్యామీన‌న్ అంటోంది.

Anasuya : సావిత్రిలా నటించడం ఎంత కష్టమో.. ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం..

నిత్యామీన‌న్ ఫ్యామిలీ విష‌యాల‌కు వ‌స్తే.. నిత్యావాళ్ల‌ది బెంగ‌ళూరులో స్థిర ప‌డిన మ‌ల‌యాళీ కుటుంబం. నిత్యామీన‌న్ ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే ఫ్రెంచ్‌–ఇండియన్ ఇంగ్లీష్ మూవీ ‘హనుమాన్‌’లో నటించింది. ఆమె ఫోటోను ‘స్టార్క్‌ వరల్డ్‌ కేరళ’ అనే టూరిజం మ్యాగజైన్‌లో చూసిన హీరో మోహ‌న్‌లాల్ మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేశాడు. ‘ఆకాశ గోపురం’ అనే చిత్రంతో ఆమె మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైంది. ఆ త‌రువాత టాలీవుడ్‌లో న‌టించింది.