Nivetha Pethuraj : నివేతా పేతురేజ్‌కి లవ్ ఫెయిల్యూర్ అయిందా? అబ్బాయి గురించి తెలుసుకొని డేటింగ్ చేయాలి అంటూ..
ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నివేతా.

Nivetha Pethuraj Interesting Comments on Relationship Audience Think she is love Failure
Nivetha Pethuraj : మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అలవైకుంఠపురంలో, దాస్ కా ధమ్కీ.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో నివేదా పేతురేజ్ బాగానే పేరు తెచ్చుకుంది. వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది నివేతా. అయితే నివేతా నటిగానే కాకుండా F1 కార్ రేసర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఈ రెండిట్లోనూ పలు పతకాలు గెలిచింది.
ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నివేతా. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. గతంలోకి వెళ్తే మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు అని ఇంటర్వ్యూలో నివేతాని అడిగితే.. డేటింగ్ చేసే ముందు ఆ అబ్బాయి గురించి బాగా తెలుసుకోవాలి. ముందు ఫ్రెండ్షిప్ చేసి ఆ తర్వాత డేటింగ్ చేయాలి అని తెలిపింది.
దీంతో.. అంటే మీకు పాస్ట్ లో బ్యాడ్ అనుభవం ఉన్నట్టు ఉంది అని అడగగా నివేతా.. ఈ రోజుల్లో అందరూ లవ్, డేటింగ్ చేస్తున్నారు. సింగిల్ గా ఉండటానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు అని తెలిపింది. దీంతో గతంలో నివేతా లవ్ ఫెయిల్యూర్ అని, ఎవరో ఆ అబ్బాయి అని కామెంట్స్ చేస్తున్నారు.