Site icon 10TV Telugu

Dasara: దసరా, శాకుంతలం సినిమాలకు అది ఇంకా కుదర్లేదా..?

No Buyers For Dasara Shaakuntalam Movie Satellite Rights

No Buyers For Dasara Shaakuntalam Movie Satellite Rights

Dasara: తెలుగు సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనం చూశాం. ఇక స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు నటించే సినిమాలకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. థియేటర్లలో సినిమాను చూడని వారు ఓటీటీ, టీవీల్లో తమ అభిమాన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇటీవల రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలకు మాత్రం అనుకోని పరిస్థితి ఏర్పడింది.

Dasara Movie: మరికొద్ది గంటల్లో ‘దసరా’ మేనియా షురూ.. ఓటీటీలోకి దిగుతున్న ధరణి!

నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫాంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, స్టార్ బ్యూటీ సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. కానీ, ఈ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంకా ఎవరూ కొనుగోలు చేయలేదట.

Shaakuntalam : నాగచైతన్య ఫ్యాన్స్ వల్లే శాకుంతలం ప్లాప్.. బిగ్‌బాస్ నటి వ్యాఖ్యలు!

ప్రస్తుతం శాటిలైట్ రైట్స్ విషయంలో టీవీ ఛానళ్లు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారీ రేటుకు శాటిలైట్ రైట్స్ కొనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. ఓటీటీ రైట్స్ రూపంలో సినిమాలకు భారీ రేటు దక్కుతున్నా, శాటిలైట్ రైట్స్ విషయంలో చిత్ర నిర్మాతలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. గతంలో వచ్చిన ‘విరాటపర్వం’ మూవీ శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు కాలేదు. అలాగే నాని ‘దసరా’, సమంత ‘శాకుంతలం’ సినిమా శాటిలైట్ రైట్స్‌ను కొనేందుకు ఛానల్స్ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ ఎప్పటికి అమ్ముడవుతాయో చూడాలి.

Exit mobile version