Shaakuntalam : నాగచైతన్య ఫ్యాన్స్ వల్లే శాకుంతలం ప్లాప్.. బిగ్‌బాస్ నటి వ్యాఖ్యలు!
బిగ్‌బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆరోహి.. సమంత శాకుంతలం ప్లాప్ అవ్వడానికి నాగచైతన్య కారణం అంటుంది.

BiggBoss Beauty Arohi Rao said Shaakuntalam flop due to Naga Chaitanya fans
Shaakuntalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన మైథలాజికల్ డ్రామా చిత్రం శాకుంతలం. హిందూ పురాణాల్లోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. శకుంతల పాత్రలో సమంత, దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన భరతుడి రోల్ ని అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ ని అనుకున్నంత రీతిలో ఆకట్టుకోలేకపోయింది.
Samantha : శాకుంతలం సినిమా రిజల్ట్ పై సమంత వైరల్ పోస్ట్..
కాగా ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) అభిమానులు కారణం అంటూ బిగ్‌బాస్ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో వర్క్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆరోహి రావు (Arohi Rao).. బిగ్‌బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఫేమ్ ని అందుకుంది.
Samantha : సిటాడెల్ కోసం సమంత ట్రాన్స్ఫర్మేషన్.. ఎలా మారిపోయిందో చూడండి..
తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా ద్వారా శాకుంతలం రిజల్ట్ గురించి మాట్లాడుతూ.. “సినిమా కొంచెం ల్యాగ్ ఉంది. అది నేను కూడా ఒప్పుకుంటాను. పురాణాలూ తెలియాలని వాళ్ళకి పంచతంత్రం కథ లాగానే ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు తీశారు సినిమాని, మసాలా వేసి తీసి ఉంటే చూసేవాళ్ళు ఏమో? ఇక సమంత పర్ఫార్మెన్స్ బాగోలేదు అన్నవాళ్లు అంత నాగచైతన్య ఫ్యాన్స్. అల్లు అర్హ చాల బాగుంది కానీ తనకంటే బాగా నటించే, అవకాశాలు చూసే వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకోని ఉంటే బాగుండేది. ఓవర్ ఆల్ గా నా వరకు సినిమా యావరేజ్. ప్లాప్ అయితే కాదు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

BiggBoss Beauty Arohi Rao said Shaakuntalam flop due to Naga Chaitanya fans