Samantha : సిటాడెల్ కోసం సమంత ట్రాన్స్ఫర్మేషన్.. ఎలా మారిపోయిందో చూడండి..

తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ వేయగా ఈ ప్రీమియర్ కి హాలీవుడ్ యూనిట్ తో పాటు బాలీవుడ్ సిటాడెల్ యూనిట్ కూడా హాజరయి సందడి చేశారు. సిటాడెల్ ప్రీమియర్ కు సమంత కూడా హాజరవ్వగా సమంత ఫొటోలు వైరల్ గా మారాయి.

Samantha : సిటాడెల్ కోసం సమంత ట్రాన్స్ఫర్మేషన్.. ఎలా మారిపోయిందో చూడండి..

Samantha Transformation for Citadel series samantha new look goes viral

Updated On : April 19, 2023 / 12:42 PM IST

Samantha :  సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నాక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయింది. ఇటీవలే సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజవ్వగా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. కానీ ఈ సినిమా కోసం ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో పాల్గొంది సమంత. ఇక ప్రస్తుతం సమంత సిటాడెల్ సిరీస్, ఖుషి సినిమా షూట్స్ లో బిజీగా ఉంది.

హాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఇదే సిరీస్ కు ఇండియన్ వర్షన్ కూడా నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తుండగా రాజ్ & డీకే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ వేయగా ఈ ప్రీమియర్ కి హాలీవుడ్ యూనిట్ తో పాటు బాలీవుడ్ సిటాడెల్ యూనిట్ కూడా హాజరయి సందడి చేశారు.

Image

Siddharth : వరుస సినిమాలతో.. మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతున్న సిద్దార్థ్..

అయితే సిటాడెల్ ప్రీమియర్ కు సమంత కూడా హాజరవ్వగా సమంత ఫొటోలు వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో హెయిర్ ముందుకు వచ్చేలా కొత్త స్టైల్ తో కనపడింది. సమంత బాగా సన్నబడినట్టు కూడా అనిపిస్తుంది. సిటాడెల్ కోసం సమంత ఇలా మారిపోయిందా, మొన్న శాకుంతలం ప్రమోషన్స్ లో ఇంకా బాగుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ఈ ప్రీమియర్ లో సమంత, వరుణ్ ధావన్ తో కలిసి క్లోజ్ గా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత సిటాడెల్ నుంచి త్వరలోనే అప్డేట్ రానుందని ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించారు.