బంధువుల అంత్యక్రియలకే వెళ్లలేకపోతుంటే షూటింగులు ఎలా చేయగలం?

బంధువుల అంత్యక్రియలకే వెళ్లలేకపోతుంటే షూటింగులు ఎలా చేయగలం?

Updated On : August 24, 2020 / 4:42 PM IST

కేంద్రం సినిమా, టీవీ షూటింగులు జరుపుకోవచ్చని పర్మిషన్లు ఇచ్చేసింది. అయినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా సినిమా షూటింగులు మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని రాష్ట్ర సినీ నిర్మాతలు అంటున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రామ్ మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు.



‘ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా రిస్క్ చేసి షూటింగ్ తీయడానికి ఎవరు రెడీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో షూటింగ్ చేయడానికి ఎవరు ముందుకొస్తారు. ప్రతి రోజూ కొవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. షూటింగులు తిరిగి మొదలుపెట్టడం కంటే ప్రజల ప్రాణాలే చాలా ముఖ్యం’ అని చెప్పారు.

థియేటర్లు ఇంకా మూసే ఉండటంతో సినీ నిర్మాతల్లో కూడా షూటింగులు మళ్లీ మొదలుపెట్టడానికి ఉత్సాహం మాయమయ్యేలా చేసింది. ‘ఒకవేళ రిస్క్ తీసుకుని షూటింగులు మళ్లీ మొదలుపెడితే.. ఎక్కడ రిలీజ్ చేయాలి. ప్రజలు వారి బంధువుల అంత్యక్రియలకు వెళ్లడానికి కూడా ముందుకెళ్లడం లేదు. అలాంటప్పుడు సినిమాహాల్స్ కు మాత్రం ఎలా వెళ్తారు.



ఒకసారి కొవిడ్-19 పరిస్థితి నుంచి బయటపడితే.. టాలీవుడ్ లో పెద్ద మొత్తంలోనే షూటింగులు జరుగుతాయని రామ్మోహన్ రావు అన్నారు.