NTR: ఊరించి ఉసూరుమనిపించారు.. తారక్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?
ప్రస్తుతం రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే పోకిరి, జల్సా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ ట్రెండ్‌కు కొనసాగింపుగా మరిన్ని సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ హీరోలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’ మూవీ కూడా చేరింది.

NTR Adhurs Re-Release To Be Postponed
NTR: ప్రస్తుతం రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే పోకిరి, జల్సా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ ట్రెండ్‌కు కొనసాగింపుగా మరిన్ని సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ హీరోలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’ మూవీ కూడా చేరింది.
NTR: తారక్‌తో భారీ సినిమాను ప్లాన్ చేస్తోన్న నాగవంశీ.. ఏ జోనరో తెలుసా?
మాస్ చిత్రాల దర్శకుడు వివి.వినాయక్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ, అప్పట్లో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో తారక్ డ్యుయెల్ రోల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మేరకు ఈ చిత్ర రీ-రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేశారు. మార్చి 4న అదుర్స్ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
NTR30: ఎన్టీఆర్ 30 లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్..?
కానీ, ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రీ-రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో తారక్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేయకపోవడంతో, కనీసం ‘అదుర్స్’ చిత్రాన్ని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేద్దామని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడంతో, ఈ మూవీని తిరిగి ఎప్పుడు రీ-రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.