NtrNeel: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. ప్రెజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్(NtrNeel) 'డ్రాగన్' మూవీ కొత్త షెడ్యూల్ మొదలయ్యింది.

NtrNeel: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. ప్రెజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

NTR and Prashanth Neel movie latest update

Updated On : January 5, 2026 / 9:54 AM IST
  • డ్రాగన్ కోసం యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్
  • హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్
  • కీ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న దర్శకుడు

NtrNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాలార్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

తన అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్ కి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్(NtrNeel). అందుకే, మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. మైత్రి మూవీ సంస్థ కూడా ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నారు. రీసెంట్ గా నిర్మాత రవి కూడా ఈ సినిమాపై కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. చిన్న చిన్న డిటైలింగ్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అవడం లేదట ప్రశాంత్ నీల్.

Ashika Ranganath: వామ్మో వాయ్యో పాటలో ఆషిక వయ్యారం.. ఫొటోలు

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా క్వాలిటీ ఉండేలా చేసుకుంటున్నాడట. దీంతో నిర్మాత రవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రల మధ్య కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నాడట. అలాగే ఎన్టీఆర్ తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించనున్నాడట.

ఈ షెడ్యూల్ తరువాత మరోసారి విదేశాలకు వెళ్లనున్నాడు ఎన్టీఆర్. అక్కడ జరిగే షెడ్యూల్ తో మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవల్లో సెట్ అయ్యేలా ‘డ్రాగన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. అంతేకాదు, ప్రశాంత్ నీల్ గత సినిమాల్లో లాగా కేవలం హీరో, ఎలివేషన్స్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ కి కూడా ఈ సినిమాలో పెద్ద పీట వేశాడట దర్శకుడు.