NTR : మరో బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఎన్టీఆర్.. త్వరలో యాడ్ రిలీజ్..

ఎన్టీఆర్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.

NTR : మరో బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఎన్టీఆర్.. త్వరలో యాడ్ రిలీజ్..

NTR as brand ambassador for Malabar gold and diamonds Ad shoot completed

Updated On : June 21, 2023 / 7:59 AM IST

NTR Ad : ఎన్టీఆర్ RRR తర్వాత సినిమాలతో, యాడ్స్ తో మరింత బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా, బాలీవుడ్ లో వార్ 2 సినిమా చెయ్యనున్నాడు ఎన్టీఆర్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇటీవల ఎన్టీఆర్ యాడ్స్ ఎక్కువగానే చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో యాపి ఫిజ్, లీసియస్, KFC.. లాంటి పలు భారీ బ్రాండ్స్ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ KFC యాడ్ చేశారు. ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ పారితోషికం కూడా కోట్లల్లోనే తీసుకున్నట్టు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా ఒప్పుకున్నారు.

బంగారు, వజ్రాభరణాలు అమ్మే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెల్లరీ కంపెనీకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఓకే చేశారు. ఇటీవలే యాడ్ షూట్ కూడా పూర్తయిందని, త్వరలోనే ఆ యాడ్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ యాడ్ షూట్ నుంచి ఓ ఫోటోని మాత్రం రిలీజ్ చేశారు. గతంలోనూ ఎన్టీఆర్ ఓ సారి మలబార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తాజాగా మరోసారి మలబార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండనున్నారు ఎన్టీఆర్. ఈ బ్రాండ్ నుంచి కూడా ఎన్టీఆర్ కోట్లల్లో పారితోషికం తీసుకున్నట్టు సమాహారం. ఇలా ఎన్టీఆర్ ఓ పక్క సినిమాలతోనే కాక మరోపక్క వరుస యాడ్స్ తో బిజీగా ఉన్నారు.