కొత్త యాడ్ కోసం కొత్తగా
యాపీ ఫిజ్ డ్రింక్‌కి యంగ్ టైగర్ బ్రాండ్ అంబాసిడర్‌గా సెలక్ట్ అయ్యాడు.

యాపీ ఫిజ్ డ్రింక్‌కి యంగ్ టైగర్ బ్రాండ్ అంబాసిడర్‌గా సెలక్ట్ అయ్యాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మంచి నటుడు, సూపర్బ్ డాన్సర్, బుల్లితెరపై బిగ్ బాస్‌తోనూ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇక అప్పుడప్పుడూ యాడ్స్‌తోనూ తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్గా తారక్ ఖాతాలో మరో న్యూ బ్రాండ్ వచ్చి చేరింది. ఫేమస్ యాపీ ఫిజ్ డ్రింక్‌కి యంగ్ టైగర్ బ్రాండ్ అంబాసిడర్‌గా సెలక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందని తెలుస్తుంది. ఎన్టీఆర్ షూట్లో పాల్గొన్నప్పటి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాపీ ఫిజ్ కలుపుతున్నట్టు, బాటిల్ మీద కూర్చని ట్రావెల్ చేస్తున్నట్టు ఉన్న రెండు ఫోటోలు ట్విట్టర్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ బ్రాండ్‌కి సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. తారక్ తెలుగు యాడ్‌లో మెరవనున్నాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన నవరతన్ ఆయిల్ యాడ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. త్వరలో ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తున్న రూ.10ల యాపీ ఫిజ్ యాడ్ బుల్లితెరపై టెలికాస్ట్ కానుంది.