Asia Cup 2025 : యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025.. భారీ రికార్డు పై రషీద్ ఖాన్ కన్ను..
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో రషీద్ మూడు వికెట్లు తీస్తే..

Asia Cup 2025 Rashid Khan Eye on Bhuvneshwar Kumar Massive Bowling Record
Asia Cup 2025 : టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో రషీద్ మూడు వికెట్లు తీస్తే ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులకు ఎక్కనున్నాడు.
టీ20క్రికెట్ ఫార్మాట్లో నిర్వహించిన ఆసియాకప్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రస్తుతం టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అతడు 6 మ్యాచ్ల్లో 5.34 ఎకానమిఈతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో రషీద్ 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు. యూఏఈ బౌలర్లు అంజద్ జావెద్ (7 మ్యాచ్ల్లో 12 వికెట్లు), మొహమ్మద్ నవీద్ (7 మ్యాచ్ల్లో 11 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
Hardik Pandya : ఆసియాకప్ 2025లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించేనా? ఇంకో 6 వికెట్లు తీస్తే..
టీ20 ఫార్మాట్లో ఆసియాకప్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* భువనేశ్వర్ కుమార్ (భారత్) – 6 మ్యాచ్ల్లో 13 వికెట్లు
* అంజద్ జావెద్ (యూఏఈ) – 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు
* మహ్మద్ నవీద్ (యూఏఈ) – 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు
* రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) – 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు
* హార్దిక్ పాండ్యా (భారత్) – 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు
ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ ఎన్ని సార్లు జరిగింది?
టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ ఇప్పటి వరకు రెండు సార్లు జరిగింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి జరగబోయేది మూడో ఎడిషన్. 2016లో తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ తరువాత 2022లో యూఏఈ వేదికగానే రెండోసారి జరిగింది. కాగా.. తొలి ఎడిషన్లో భారత్ విజేతగా నిలవగా, రెండో ఎడిషన్లో శ్రీలంక కప్పును ముద్దాడింది.